వియోగం
Bereavement
Below is a Telugu translation of our information resource on bereavement. You can also view our other Telugu translations.
హక్కు నిరాకరణ
దీన్ని చదవడానికి ముందు, దయచేసి మా నిరాకరణను సమీక్షించండి.
ఈ సమాచారం అనేది ఎవరైతే వియోగం చెందారో, వారి కుటుంబం మరియు స్నేహితులు, లేదా మరెవ్వరు అయినా మరింత తెలుసుకోవడానికి.
ఈ పేజీలో మీరు ఈ సమాచారాన్ని గురించి తెలుసుకుంటారు:
- ప్రజలు సాధారణంగా ఒక నష్టం తర్వాత ఏ విధంగా బాధపడుతారు
- పరిష్కరించని దుఃఖం
- సహాయం పొందుటకు ప్రదేశాలు
- ఇతర సమాచార మూలాలు
- స్నేహితులు మరియు బంధువులు ఎలా సహాయపడగలరు.
వియోగం అంటే ఏమిటీ?
వియోగం అనేది ఒక బాధాకరమైన కానీ సాధారణ అనుభవం. మనలో చాలామంది, జీవితంలో ఏదో ఒక సమయంలో, మన ప్రియమైన వారి మరణం లేదా నష్టాన్ని అనుభవిస్తాము.
ఇప్పటికీ మన రోజూవారి జీవితంలో చావు గురించి ఆలోచన మరియు మాట్లాడటం తక్కువగా ఉంది, బహుశా ఎందుకంటే ఇది మనం మన పూర్వికుల కంటే తక్కువ గా ఎదుర్కొంటున్నాము. వారికి, వారి యొక్క సహోదరుడు లేదా సహోదరి, స్నేహితుల లేదా బంధువు యొక్క చావు అనేది వారి బాల్యము లో, లేదా కౌమార దశ లో ఒక సాధారణ బాగం అయినది. మనకు, ఈ నష్టాలు సాధారణంగా జీవితంలో తరువాత జరుగుతాయి. కాబట్టి, దుఃఖం గురించి - అది ఎలా అనిపిస్తుంది, ఏమి చేయాలనేది సరైనది, ఏది 'సాధారణం' అనేది తెలుసుకునే అవకాశం మనకు లేదు. మరియు దాన్ని అంగీకరించే అనుభవం మనకు లేదు.
అయినప్పటికీ, మనం ప్రేమించే వ్యక్తిని కోల్పోయినప్పుడు మనం ఆ బాధను తట్టుకోవాలి. మనమంతా వ్యక్తిగత వ్యక్తులమే, మరియు ప్రతి ఒక్కరికీ తమతమ శోకాన్ని వ్యక్తపరచుకునే తమ స్వంత విధానాలు ఉంటాయి - కానీ శోకం లో ఉన్నపుడు మనలో చాలామంది అనుభవాలను పంచుకున్నారు.
మనం దుఃఖాన్ని ఎలా అనుభవిస్తాం
ఏదైనా నష్టం వలన మనం బాధపడతం, కానీ మన ప్రియమైన వారు చనిపోతే అత్యంత బాధపడతం. బాధ అనేది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే బావోద్వేగా ల పరంపర. అవి బయటపడటానికి కొంత సమయం పడుతుంది మరియు ప్రతి వ్యక్తి దీన్ని వారి స్వంత వేగంతో చేస్తారు.
మనం సాధారణంగా కొంతకాలం పరిచయం ఉన్న వ్యక్తిని కోల్పోతే దూషిస్తాము. అయినప్పటికీ, ఎవరైతే శిశు మరణం లేదా గర్భస్రావం, లేదా శిశువును కోల్పోవడం వంటి వారు కూడా అదే విధంగా బాధపడుతారు. వారికి కూడా అదే రకమైన శ్రద్ధ మరియు పరిశీలన అవసరం.
ప్రజలు శోకం తో ఉన్నపుడు రకరకాల మనోభావాలను చూస్తారు. ఈ రకమైన అనుభూతులు ఏ ప్రత్యేక క్రమంలోనూ కనిపించవు. అది అయిపోయిందని మీరు అనుకున్న తర్వాత కొన్నిసార్లు ఒక భావన తిరిగి వస్తుంది. మనలో కొంతమందికి ఈ రకమైన అనుభవాలు అసలు ఉండకపోవచ్చును.
ఆఘాతం
దగ్గరి బంధువు లేదా స్నేహితుడు మరణించిన తర్వాత, చాలా మంది అది నిజంగా జరిగిందని నమ్మలేకపోతున్నట్లుగా ఆఘాతంకు గురవుతారు. మరణం అంచనా వేసినా, వారు అలాగే అనుభవించవచ్చు.
ఈ భావోద్వేగాత్మక అనిస్సరణ భావం కొన్నిసార్లు సహాయపడవచ్చు, ముఖ్యమైన కార్యాచరణ ఏర్పాట్లను పూర్తి చేయడంలో, ఉదాహరణకు, బంధువులను సంప్రదించడం మరియు అంత్యక్రియలను నిర్వహించడం వంటి పనులను చేయడంలో. కానీ, ఈ భ్రమలో ఎక్కువ కాలం ఉండుట అనేది ఇబ్బంది తెస్తుంది. మరణించిన వారిని చూడటం వలన బహుశా, కొంతమందికి, ఆ బాధను అధిగమించేందుకు అదే ముక్యమైన మొదటి మార్గంగా ఉంటుంది.
చాలా మందికి, అంత్యక్రియలు లేదా స్మారక సేవ అనేది ఏమి జరిగిందో దాని వాస్తవికత నిజంగా మనసులో మునిగిపోవడం ప్రారంభించే ఒక సంఘటన. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరం చూడటం లేదా అంత్యక్రియలకు హాజరు కావుట చాలా బాద కరంగా ఉంటుంది, కానీ ఈ రకమైన పద్ధతి మన ప్రియమైన వారికి తుది వీడ్కోలు పలికేవి. ఆ సమయంలో, అంత్యక్రియలకు వెళ్లడం చాలా బాధగా ఉందని మీకు అనిపించవచ్చు. కానీ, ఒకవేళ వారు అలా చేయక పోతే, రానున్న సంవత్సరాలులో అపరాధ భావంతో ఉంటారు.
నిరాకరణ
త్వరలోనే, ఈ శూన్యత మాయమైన మరియు బహుశా అది నిరాకరణ గా మార్పు చెందవచ్చు. జరిగిన దానిని అంగీకరించడం మీకు కష్టంగా ఉంటుంది. మీకు వాస్తవాలు తెలిసినా కూడా, నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు. మీరు కేవలం మృతుని కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇది అసాధ్యమని తెలిసిన కూడా, మీకు కేవలం కావాలి అని, ఎలా అయినా, వారిని కనుగొను. ఇది విశ్రాంతి లేకుండా లేదా ఏకాగ్రత మరియు నిద్ర కూడా క్రమంగా లేకుండా చేస్తుంది. కలలు విచారకరంగా ఉంటాయి.
కొంతమంది వారికి వారి ప్రియమైన వారు ఎక్కడికి వెళ్లిన వారే కనిపిస్తున్నట్లు ఉంటుంది - వీధుల్లో, ఉద్యానవనంలో, ఇంటి చుట్టూ, వారు కలిసి జీవించిన అన్ని చోట్ల.
కోపం మరియు అపరాధ భావం
ఈ దశలో చాలా కోపంగా ఉంటారు - వైద్యుల మరియు నర్సుల పట్ల, చావు ని ఆపేలా చేయనందుకు,స్నేహితులు మరియు బంధువుల మీద, ఏమీ చేయనందుకు, లేదా మిమ్మల్ని వదిలేసి వెళ్లిన చని పోయిన వ్యక్తి మీద కూడా. మీకు మీ మీద కూడా సరిగా చేయలేదు అన్న కోపం వస్తుంది.
మరొక సాధారణ అనుభూతి అపరాధ భావం. మీరు చెప్పాలనుకున్న లేదా చేయాలనుకున్న అన్ని విషయాలను మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉంటారు. మీరు భిన్నంగా పనులు చేయడం ద్వారా, ఏదో ఒకవిధంగా మరణాన్ని నివారించవచ్చని కూడా మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఒక చావు అనేది ఎవరి నియంత్రణలో లేనిది మరియు వియోగం పొందిన వ్యక్తి దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి ఒక వేధించే లేదా బాధకమైన వ్యాధి తర్వాత మరణించినప్పుడు, మీరు ఉపశమనం పొందినట్లు అనిపిస్తే కూడా, దానికి అపరాధం గా అనిపించవచ్చు. ఈ ఉపశమనం కలిగించే భావన సహజమైనది, అర్థమయ్యేది మరియు చాలా సాధారణమైనది.
విషాదం
ఈ ఆందోళన స్థితికి సాధారణంగా నిశ్శబ్దమైన విషాదం లేదా ఒంటరితనం మరియు మౌనతా అనుసరిస్తాయి, అప్పుడు మీరు ఒంటరిగా ఉండాలని మాత్రమే అనుకుంటారు. ఈ అకస్మాత్ భావోద్వేగ మార్పులు మిత్రులకు లేదా బంధువులకు గందరగోళాన్ని కలిగించవచ్చు, కానీ ఇవి శోక ప్రక్రియలో సహజమైన భాగాలలో ఒకటి.
మీకు తక్కువ ఆందోళన అనిపించిన ప్పటికీ, ఆవేదన దశలు అనేవి కాలం గడిచిన కొద్ది తరచూ వస్తాయి. మీరు అప్పుడప్పుడు బాధతో కూడిన ఆకస్మిక కుదుపులను అనుభవించవచ్చు, ప్రత్యేకంగా మీ కోల్పోయిన వ్యక్తిని గుర్తు చేసే వ్యక్తులు, ప్రదేశాలు లేదా వస్తువుల వల్ల అవి మళ్లీ ఉత్తేజితమవుతాయి.
మీరు ఆకస్మికంగా స్పష్టమైన కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటే ఇతరులు అర్ధము చేసుకోడానికి కష్టంగా లేదా అసౌకర్యం గా అనుభవించడానికి ఇబ్బంది పడుతారు. ఈ దశలో పూర్తిగా అర్దం చేసుకోని వారి నుంచి దూరంగా ఉండేందుకు లేదా బాధలను చెప్పుకోకుండా ఉంటారు. కానీ, ఇతరులను దూరంగా ఉండుట వలన భవిష్యత్తులో ఇబ్బంది చూస్తారు ,మరియు సాధారణ జీవితంలోకి (ఏ మేరకు కుదిరితే) రావటానికి ఆరంభింస్తే ఒక రెండు వారాల తర్వాత లేదా సుమారు.
ఈ కాలంలో, ఇతరులకు మీరు ఏమి చేయకుండా కాలీగా కూర్చొని Sసమయాన్ని గడుపుతున్నారు అనిపిస్తుంది. నిజానికి, మీరు కోల్పోయిన వ్యక్తి గురించి ఆలోచన పునరావృతం కావడం వలన, మంచి రోజులు అలానే చెడు రోజులు కూడా రెండు కలిపి మీకు ఉంటాయి. ఇది శాంతమైన కాని మరణంని అంగీకరించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన భాగం.
కాలం గడుస్తున్నా కొద్దీ, వియోగం వలన పొందిన తీవ్రమైన నొప్పి మెల్లగా తగ్గుతుంది. ఆవేదన అనేది తగ్గుతూ వస్తుంది మరియు ఇతరత్రా వాటి గురించి ఆలోచించే సదుపాయం మరియు భవిష్యత్తు గురించి మరలా చూసే అవకాశం ఉంటుంది. అయితే, మీలో కొంత భాగాన్ని కోల్పోయిన భావన పూర్తిగా ఎప్పటికీ పోకుండా ఉంటుంది.
ఒకవేళ మీరు మీ భాగస్వామిని కోల్పోతే వారి యొక్క జ్ఞాపకాలు కొత్త ఒంటరితనాన్ని గుర్తు చేస్తాయి, వేరే జంటని చూసినప్పుడు మరియు మాధ్యమం చిత్రాలు వంటి సంతోష కుటుంబాన్ని చూసినప్పుడు. అయినప్పటికీ, కొంతకాలం తర్వాత మీ జీవితంలో ఒక భాగం లేకపోయినా, మళ్లీ సంపూర్ణంగా అనిపించవచ్చు. అయినప్పటికీ, ఏళ్ల తర్వాత, మీరు కోల్పోయిన వ్యక్తి ఇప్పటికీ మీతో ఉన్నట్లుగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు.
అంగీకారం
ఈ విభిన్న అనుభవాలు ఒకదానికొకటి మిళితమై, భిన్న వ్యక్తులకు భిన్న రకాలుగా వ్యక్తం అవుతాయి. మనలో చాలామంది ఒకటి లేదా రెండు సంవత్సరాలలో తీవ్ర విషాదం నుంచి కోలుకుంటారు. దుఃఖం యొక్క చివరి దశ చనిపోయిన వ్యక్తి గురించి వదిలి పెట్టడం మరియు కొత్త జీవన శైలి నీ ప్రారంభం చేయడం. మీ యొక్క మనో స్తితి మెరుగ్గా అవుతుంది, మీ నిద్ర మెరుగు పడుతుంది మరియు మీ శక్తి సాధారణ స్తితికి వస్తుంది. మీరు మరలా సాధారణ వ్యక్తిగా, మీ లైంగిక ఆసక్తి తిరిగి రావడం జరుగుతుంది.
చెప్పినట్లు గా, వివిధ సంస్కృతి గల ప్రజలు చావును వివిధమైన వారి యొక్క విలక్షణమైన పద్ధతి లో ఎదుర్కొంటారు. కొన్ని సమూహాలలో, చావును ఒక జీవితం మరియు చావు ల నిరంతర ప్రక్రియలలో ఒక దశ గా చూస్తారు; 'పూర్తి విరామం' లాగా కాకుండా. ఆచారములు మరియు విధి విధానాలు అనే శోకం అనేది బహిరంగంగా మరియు సూచించే, లేదా గోప్యమైన మరియు నిశబ్దం గా ఉంటాయి. కొన్ని ఆచారాలలో శోకం అనేది నిర్దేశించపడుతుంది, ఇతరులకు అలా కాదు. శోకం అనుభవించే వారి భావాలు అన్ని సాంప్రదాయాలలో ఒకే విధంగా ఉండొచ్చు, కానీ వారు వారి యొక్క భావాన్ని వ్యక్తపరిచే విధానం అనేది భిన్నంగా ఉంటుంది.
పిల్లలు మరియు కిషోరులు
అయినప్పటికీ పిల్లలు వారి యొక్క చిన్న వయసు కి చావు యొక్క అర్దం తెలియక పోయిన, దగ్గరి బంధువుల నష్టాన్ని పిల్లలు కూడా వారి పెద్దవారు బాధపడుతున్న విధంగా బాద పడుతారు. శిశువు దశ నుంచే, పిల్లలు బాధను మరియు తీవ్ర మనోవేదన భావిస్తారు.
ఏదైనా, వారు పెద్దలు కన్న విభిన్న అనుభవం కలిగి ఉంటారు మరియు బహుశా శోక దశ లను త్వరగా దాటి పోతారు. పాఠశాల తొలి ఏళ్ల లో, వారి దగ్గరి బంధువు యొక్క మరణానికి బాద్యతని అనుభవిస్తారు కనుక అందుకే వారికి వారి పొరపాటు ఏమి లేదని భరోసా ఇవ్వాలి. యువత వారి బాద గురించి చుట్టూ ఉన్న పెద్దవారికి అదిక భారం అవుతుంది అని ఇలాంటివి మాట్లాడరు.
పిల్లల యొక్క మరియు యువత యొక్క, మరియు వేదన అవసరం కోసం, కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పట్టించుకోకపోవడం. సాధారణంగా వారిని, ఉదాహరణకు, అంత్యక్రియల ఏర్పాట్లలో చేర్చవచ్చు.
ఆత్మహత్య అనంతరం శోకం
ఎవరైనా తెలిసిన వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతే, ప్రత్యేకంగా ఇది ఎదుర్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సాధారణ శోకం తో పాటుగా, చాలా అయోమయ భావనలు కలిగి ఉంటాయి. మీకు అనిపించవచ్చు:
- ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిగత పై కోపంగా ఉండటం.
- వారు చేసిన పనిని నిరాకరించడం.
- ఎందుకు అలా చేశారు అని అయోమయంగా అవడం.
- అపరాధ భావన - తీవ్ర నిరాశ వలన చాలా మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు:మరణించిన వారి యొక్క భావన ను ఎలా గమనించకుండా ఉన్నారు?
- వారి మరణం ఆపే ప్రయత్నం చేయ లేదని అపరాధ భావన - మీరు వారి మరణించిన వ్యక్తితో గడిపిన సమయాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ, మీరు దీన్ని నివారించడానికి ప్రయత్నిస్తే
- ఒకవేళ మరణించిన వ్యక్తి కష్టం అనుభవించారేమో అని చింత
- మీరు ఇకపై వారి కష్టాన్ని భరించే అవసరం లేదు
- మీకు ఆ వ్యక్తి యొక్క ఆత్మహత్య ఆలోచన మరియు ప్రేరేపణలు గురించి మద్దతు యొక్క భారం తగ్గింది
- వారు చేసిన పనికి సిగ్గు పడటం - ముఖ్యంగా ఒకవేళ సాంప్రదాయంలో లేదా మతం లో ఆత్మహత్య అనేది ఒక పాపం గా లేదా అవమానం గా చూపడం
- దీని గురించి ఇతరుల తో మాట్లాడేందుకు సంకోచం a) వారి సాంప్రదాయ దోషం లేదా b) మరణించిన వ్యక్తి లేదా వారి మనో భావం తో కాకుండా ప్రజలు పరిస్థితి యొక్క నాటకీయత మీద ఎక్కువ ఆసక్తి ఉందని అనుకోవడం
- ఏకాంతంగా - ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి యొక్క సహచరులు ఇతరుల తో మాట్లాడటం సహాయం చేస్తుంది.
NICE మార్గ దర్శకాలు 105 (సెక్షన్ 1.8) అందిస్తుంది శోక ప్రజలకు మద్దతు ఇచ్చే సూచనలు లేదా అనుమానంతో ఆత్మహత్య వల్ల ప్రభావితం అయిన వ్యక్తులకు మద్ధతు. ఇతర సహాయ వనరుల చేర్పు:
- జాతీయ ఆత్మహత్య నివారణ సమాఖ్య (NSPA) సహాయం అనేది హస్త పుస్తకం నుంచే.
- ఆత్మహత్య తరువాత మద్దతు భాగస్వామ్య వెబ్ సైటు.
- జాతీయ ఆత్మహత్య నివారణ సమాఖ్య NSPA'S స్థానిక ఆత్మహత్య మద్దతు సేవల మార్గదర్శని.
ఒక శవ పరీక్ష
ఏదైనా అనుకోని మరణం తరువాత సాధారణంగా చేసే ఒక శవ పరీక్ష. ఇది వ్యక్తి యొక్క మతాన్ని లేదా సాంప్రదాయ నమ్మకంకి విరుద్ధంగా జరిగితే, వారి స్నేహితులు లేదా బంధువులు మరణ పరిశోధన అధికారికి చెప్పాల్సి ఉంటుంది, మరియు ఏదైనా ప్రత్యేక అధికారి ఉంటే వీలైనంత త్వరగా చెప్పాలి.
సాధారణంగా విచారణ కొనసాగుతోంది. సాక్ష్యం అనేది దర్యాప్తు నిర్వహించిన అధికారి న్యాయస్థానంలో సమర్పించే సందర్భంలో, న్యాయస్థానం జరిగింది కనుక్కో డానికి ప్రయత్నం చేస్తుంది. మీరు దర్యాప్తుకి వెళ్లడం వల్ల మీకు సహాయం పొందవచ్చు - కానీ ఒకవేళ వెళ్ల కూడదు అని అనుకుంటే, అప్పుడు కూడా మీరు దర్యాప్తు అధికారుల నుంచి మొత్తం దర్యాప్తు పత్రాన్ని పొందవచ్చు (దీనికి రుసుం లేదు).
మెరుగైన సమాచారం కోసం ప్రభుత్వం తరపున మరణ పరిశోధన మరియు మరణం దర్యాప్తు చేయు వారికి సూచనలు మరియు ఒక దర్యాప్తు అధికారికి మరణం గురించి తెలియ చేస్తే ఏమీ అవుతుంది.
ఏ విధంగా స్నేహితులు మరియు బంధువులు సహాయ పడగలరు?
- మీరు శోకంతో ఉన్న వ్యక్తితో సమయం గడపడం ద్వారా సహాయం చేయవచ్చు. మాటల కన్నా , వారికి ఈ నొప్పి మరియు బాద సమయాల్లో మీరు వారితో ఉన్నారు అని తెలియాల్సిన అవసరం ఉంది. ఒక సానుభూతి తో భుజాలపై చేతిని ఉంచడం అనేది శ్రద్ద మరియు మద్దతుని మాటలు చాలనప్పుడు ఇస్తుంది.
- ఇది చాలా ముఖ్యమైనది, ఒకవేళ వారు కోరుకొంటె , ఒక శోక సంద్రం వ్యక్తి ఎవరితో అయినా కలిసి ఏడవ వచ్చు మరియు వారి వేదనను మరియు కష్టం గురించి చెప్పుకోవచ్చు, ఎవరి బలవంతం లేకుండా. కాల క్రమేణా, వారు దానికి అలవాటు పడుతారు, కానీ అంత కన్నా ముందు వారు మాట్లాడే మరియు శోకించు అవసరం ఉంది.
- ఇతరులు దీన్ని కష్టంగా అనుకోవచ్చును, ఎందుకు శోకించు వ్యక్తి పదే పదే అవే మాట్లాడుతూ ఉంటారు అని, కానీ ఇది బాద నుంచి బయటకు వచ్చే విధానంలో భాగం మరియు అందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఒకవేళ మీకు ఏమి చెప్పాలి తెలియక పోతే, లేదా దీని గురించి అసలు మాట్లాడటానికి తెలియకపోతే, నిజాయితీగా ఉండండి మరియు అలా చెప్పండి. అది వారికి శోకించు వారికి వారు ఏమి కావాలో చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. సాధారణంగా వ్యక్తులు తరచుగా చనిపోయిన వ్యక్తి పేరు చెప్పకుండా దాటవేస్తారు కలత చెందుతారు అనే భయం తో. ఏదైనా, ఇతరులు వారి యొక్క నష్టాన్ని మరిచిపోయారు అనుకోవచ్చును, అది వారిని ఒంటరిగా భారాన్ని అనుభవించే లాగా చేయవచ్చు.
- కేవలం పండుగ సమయాల్లో మరియు సంవత్సరాలలో మాత్రమే కాకుండా (మరణం మాత్రమే కాకుండా పుట్టిన రోజు మరియు పెళ్లి Rరోజు కూడా) అనేవి బాదకరమైనవి అని గుర్తు పెట్టుకోవాలి. స్నేహితులు మరియు బంధువులు మన చుట్టూ ఉండటానికి ప్రత్యేక ప్రయత్నం చేస్తారు.
- ఆచరణాత్మక శుభ్రపరిచే సహాయం, కొనుగోళ్లు లేదా పిల్లల సంరక్షణ వంటివి ఒంటరితనం యొక్క భారాన్ని సులభతరం చేస్తాయి. వృద్ధ శోకించు సహచరుడు కి వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తి చేసే సహజ పనుల్లో సహాయం కావాల్సి ఉంటుంది - ఆర్థిక భారం తట్టుకోవడం, వంట, ఇంట్లో పని, కారు మరమ్మతులు మరియు మొదలైనవి.
- సరిపడా దుఃఖించు సమయాన్ని ప్రజలకు ఇవ్వడం అనేది ముఖ్యం. కొంతమంది నష్టం నుంచి త్వరగా బయట పడతారు, కాని ఇతరులు చాలా సమయం తీసుకుంటారు. అందువల్ల,తొందరగా కోలుకొనే తీరును శోకించు బంధువు లేదా స్నేహితుడు నుంచి కోరుకోకూడదు - వారికి క్రమంగా శోకించు సమయం అవసరం, మరియు అది రాబోయే రోజుల్లో ఎదుర్కోనే కష్టాలను తొలగిస్తుంది.
పరిష్కరించని దుఃఖం వల్ల ఏమి జరుగుతుంది?
ఇంకా ఒక్కసారి కూడా బాధపడని వ్యక్తులు ఉన్నారు. వారు అంత్యక్రియ కార్యక్రమంలో దుఃఖించరు, వాళ్ల నష్టం గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకురారు మరియు వారి సాధారణ జీవతం లోకి గుర్తించదగ్గ వేగంగా వస్తారు. ఇది వారి యొక్క సాధారణంగా నష్టం నుంచి కోలుకొనే విధానం మరియు దానివల్ల హానికరమైన ఫలితం ఉండదు, కానీ ఇతరులు అసాధారణ శారీరక లక్షణాలు లేదా తరచూ వచ్చే మానసిక ఒత్తిడి నీ రాబోయే సంవత్సరాలలో అనుభవిస్తారు. కొంతమందికి సరైన దుఃఖించు అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారం లేదా కుటుంబాన్ని చూసుకోవడం వల్ల పెరిగిన బాద్యతలు, సమయం లేకపోవడానికి కారణమౌతాయి.
కొన్నిసార్లు మనం చూస్తే నష్టం వలన శోకం అనేది 'సరిగా' ఉండదు. ఇది తరచుగా జరుగుతుంది, కానీ ఎప్పుడు అలానే అవుతుంది అని కాదు, ఎవరైతే గర్భస్రావం లేదా సిజ్జువు ప్రసవం లేదా గర్భ నిరోధం అనుభవించిన వారికి. మరలా, తరచూ దశల వారి ఆవేదన అనేది వస్తు ఉంటుంది.
కొంతమంది బాధను అనుభవించడం ప్రారంభిస్తారు కాని అందులోనే ఇరుక్కపోతారు. ప్రారంభంలో తీవ్ర భావోద్వేగ ప్రతి స్పందన మరియు నమ్మలేని భావన కొనసాగుతూ ఉంటుంది. కాలం గడుస్తున్నా కూడా మరియు వారు వారి ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన విషయం నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఇతరులు మరే విషయాన్ని ఆలోచించలేక కొనసాగుతూ ఉండొచ్చు, చనిపోయిన వ్యక్తి గదిని తరుచూ వారి జ్ఞాపకార్థం ఒక పవిత్ర స్థలం గా మార్చుతారు.
కొన్నిసార్లు, ప్రతి శోకం యొక్క ఆవేదన అనేది ఎంత లోతుగా ఉంటుంది అంటే ఆహారం మరియు నీరు తీసుకోవడం మానేయడం, మరియు ఆత్మహత్య ఆలోచన రావడం.
మీ వైద్యుడు నుంచి సహాయం
శోకం అనేది మన ప్రపంచాన్ని తల కిందుగా చేస్తుంది-మరియు ఇది ఒక చాలా నొప్పిని భరించే అనుభవం కలిగి ఉంటుంది. ఇది వింత అయిన, భయముతో, మరియు తీవ్ర మైనది గా ఉంటుంది. అయినప్పటికీ, ఇది జీవితంలోని ఒక భాగం, అందరూ దీని భారిన పడుతారు మరియు దీనికి వైద్య శ్రద్ద అవసరం లేదు. ఏదైనా, బాద అనేది తీవ్ర సమస్యగా కొన్నిసార్లు మారుతుంది.
- ఒకవేళ ఎవరి బాద అయినా కొన్ని నెలలు తరువాత తగ్గకుండా ఉంటే, వారి సాధారణ వైద్యుడు సహాయం చేస్తాడు. కొంతమంది కి, అదే రకమైన అనుభవం ఉన్న ఇతరులతో వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. ఇతరులు శోక నివారణ సలహదారు లేదా మానసిక చికిత్స నిపుణుల, ప్రత్యేక సమూహం లేదా వారి సొంతంగా అయినా చూపించుకోవాల్సి రావచ్చు.
- అప్పుడప్పుడూ, నిద్రలేమి రాత్రిళ్లు అనేవి తదుపరి తీవ్ర సమస్య గా మారవచ్చు. వైద్యుడు కొన్ని రోజులపాటు నిద్ర లేమికి మందులు సదుపాయం ఇస్తారు.
- ఒకవేళ ఆవేదన అనేది తీవ్రంగా మారుతుంటె, ఆకలిని, శక్తిని మరియు నిద్రని ప్రభావం చేస్తే ఉత్ప్రేరక ఔషధం సహాయం చేస్తాయి;ఉత్ప్రేరక ఔషధం యొక్క ప్రచారం పత్రం చూడండి అదిక సమాచారం కోసం. ఒకవేళ మీ ఆవేదన ఇంకా కూడా తగ్గకుండా ఉంటే మీ సాధారణ వైద్యుడు ఒక మానసిక వైద్యుడు తో నియామకం చేస్తారు.
- ఎవరైతే ప్రాణాంతకమైన వ్యాధి వలన ఒకరిని కోల్పోయారో, చాలా మానసిక ఊరట కేంద్రాల్లో ఉచిత శోక నివారణ సేవా మరియు మద్దతు అందిస్తారు.
- ఎవరు అయితే ఇబ్బందుల్లో పడుతారో, సహాయం అనేది అందుబాటులో ఉంది, కేవలం వైద్యులు మాత్రమే కాదు, కానీ కింద పేర్కొన్న సంస్థల నుంచి కూడా.
వియోగం గురించి మద్దతు మరియు సలహా
హెల్ప్‌లైన్: 0800 634 9494
ఒకే ఉచిత ఫోన్ నంబర్ ద్వారా అనేక రకాల ఆచరణాత్మక సమస్యలపై దుఃఖంలో ఉన్నవారికి మద్దతు ఇస్తుంది. ఇది మరణం నమోదు చేయడం మరియు అంత్యక్రియల నిర్వాహకుడిని కనుగొనడం నుంచి చట్టపరమైన, పన్ను, మరియు లబ్ది సంబంధిత ప్రశ్నల వరకు శోక సందర్భంలో ఉన్న అన్ని విషయాల్లో సలహా ఇస్తుంది.
హెల్ప్‌లైన్: 0800 83 85 87
అనుభవం ఉన్న సలహ దారు ఆవేదనతో ఉన్న వారితో మాట్లాడేందుకు మరియు వినడానికి మరియు సలహ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు.
సహాయం మరియు సమాచారం లైన్: 0800 02 888 40
దుఃఖిస్తున్న కుటుంబాలకు మరియు వారి పట్ల శ్రద్ధ వహించే నిపుణులకు సహాయం చేసే జాతీయ స్వచ్ఛంద సంస్థ.
క్రూస్ బీరేవ్‌మెంట్ కేర్మరియు క్రూస్ బిరీవ్మెంట్ కేర్ స్కాట్లాండ్
హెల్ప్‌లైన్: 0808 808 1677
హెల్ప్‌లైన్ (స్కాట్లాండ్): 0845 600 2227
తెలిసిన దగ్గర వారు చనిపోయిన తర్వాత మద్దతును ఇస్తుంది. శోకించు వారికి ముఖాముఖి మరియు సమూహం మద్దతుని శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకుల నుంచి మద్దతు యూకే అంతట లభిస్తుంది.
ఇంగ్లాండ్ మరియు వేల్స్ అంతటా 32000 మంది సభ్యులతో కూడిన కూటమి, ప్రజలు మరణం, మరణం మరియు వియోగం గురించి మరింత బహిరంగంగా మాట్లాడటానికి మరియు జీవితాంతం ప్రణాళికలు రూపొందించడానికి సహాయపడటం దీని లక్ష్యం.
హెల్ప్‌లైన్: 01460 55120
ఇమెయిల్: contact@rosiecranetrust.co.uk
ఏ వయసు వారైనా కొడుకు లేదా కూతురు కోల్పోయిన తర్వాత దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ట్రస్ట్ మద్దతు ఇస్తుంది.
హెల్ప్‌లైన్: 116 123
ఇమెయిల్: jo@samaritans.org
ఆత్మహత్య లేదా నిరాశకు గురైన మరియు మాట్లాడటానికి ఎవరైనా అవసరమైన బాధలో ఉన్నవారికి మద్దతు అందించే జాతీయ సంస్థ.
ఆత్మహత్య తరువాత మద్దతు భాగస్వామ్యం
ఒక సంస్థ ల సమూహం ఎవరు అయితే శోకం లో లేదా ఆత్మహత్య ప్రభావం ఉన్న వారికి మద్దతు ఇస్తుంది.
ఆత్మహత్య వల్ల శోకం కలిగిన బాధితులు
హెల్ప్‌లైన్: 0300 111 5065
యూకె అంతటా శోకం లో ఉన్న పెద్దవారికి ఒక స్వయం సేవా సంస్థ ఉంది, అది శోక బారిన పడిన వారిచేత నడపపడుతున్నది.
దయతో కూడిన మిత్రులు: శోకించు తల్లిదండ్రులు ని మరియు వారి కుటుంబానికి మద్దతు ఇవ్వడం
హెల్ప్‌లైన్: 0345 123 2304
శోకించు తల్లిదండ్రుల, తోబుట్టువు ల మరియు పెద్దల తల్లిదండ్రుల, ఎవరు అయితే వారి యొక్క బిడ్డ /పిల్లలు చనిపోతే బాధను పడుతున్నారో, వారి కోసం ఒక సేవా సంస్థ.
ఫోన్: 0808 802 6868
ఇమెయిల్: support@lullabytrust.org.uk
ఆకస్మికంగా బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ప్రత్యేక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ, సురక్షితమైన శిశువు నిద్రపై నిపుణుల సలహాను ప్రోత్సహిస్తుంది మరియు ఆకస్మిక శిశు మరణం గురించి అవగాహన పెంచుతుంది.
క్యాన్సర్ వలన తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఒక సేవా సంస్థ మద్దతు ఇస్తుంది. లండన్ మరియు ఆక్స్ఫోర్డ్ లో (ప్రదానంగా విద్యార్థులకు), మరియు ఇతర మద్దతు కార్యక్రమంలో ఇది సమూహంమద్దతు గా పని చేస్తుంది.
50 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు మరియు స్త్రీల కోసం వారి భాగస్వామి మరణించినప్పుడు ఏర్పాటు చేయబడిన స్వచ్ఛంద సంస్థ.
విన్స్టన్'స్ విష్ అనేది UK లోని ఒక జాతీయ స్వచ్ఛంద సంస్థ, ఇది పిల్లలు, యువకులు (25 సంవత్సరాల వరకు) మరియు వారి కుటుంబాలకు దగ్గరగా ఉన్న ఎవరైనా మరణించినప్పుడు వారికి శోక సహాయాన్ని అందిస్తుంది.
ఉచిత ఫోన్ హెల్ప్‌లైన్: 08088 020 021
ఇమెయిల్: ask@winstonswish.org
ఇంకా చదవడానికి
- ఏ గ్రీఫ్ అబ్సర్వడ్ , C.S. ద్వారా లెవీస్.
- మీరు దాన్ని అధిగమిస్తారు: వియోగం యొక్క కోపం, వర్జీనియా ఐరన్‌సైడ్ ద్వారా.
- క్రూస్ బీరేవ్‌మెంట్ కేర్ వివిధ రకాలుగా సూచించబడిన మెటీరియల్స్‌ను కూడా అందిస్తుంది.
సూచనలు
సహకారం
ఈ సమాచారాన్ని రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ ఎడిటోరియల్ బోర్డ్ (PEEB) రూపొందించింది.
శ్రేణి సంపాదకులు: డా ఫిలిప్ టిమ్స్
శ్రేణి నిర్వాహకులు: థామస్ కెన్నెడీ
నిపుణుల సమీక్ష: డా మనోజ్ రాజగోపాల్
ప్రచురించబడింది: మార్చి 2020
సమీక్ష గడువు: మార్చి 2023
© రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్
This translation was produced by CLEAR Global (Mar 2025)