పెద్దవారిలో ఆవేదన

Depression in adults

Below is a Telugu translation of our information resource on depression in adults. You can also view our other Telugu translations.

హక్కు నిరాకరణ

దీన్ని చదవడానికి ముందు, దయచేసి మా నిరాకరణను సమీక్షించండి.

ఈ సమాచార కరపత్రం నిరాశ, బాధ, నిరుత్సాహం లేదా నిస్సహాయంగా ఉన్న ఎవరికైనా, వారు కష్టపడుతున్నట్లు భావించే మరియు తమకు నిరాశ ఉందని భావించే ఎవరికైనా. బంధుమిత్రులకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ఇది ఆవేదనఎలా ఉంటుందో (మీ మనస్సులో మరియు మీ శరీరం రెండింటిలోనూ), మీరు మీకు సాయపడే మార్గాలు, అందుబాటులో ఉన్న కొన్ని సాయ మరియు నిరాశకు గురైన మరొకరికి ఎలా సాయ చేయాలో వివరిస్తుంది.

కరపత్రం చివరలో, మీకు మరింత సమాచారాన్ని అందజేయగల ఇతర ప్రదేశాల జాబితా ఇవ్వబడ్డది.

బాధగా అనిపించడానికి మరియు నిరాశ కలిగి ఉండటానికి మధ్య గల తేడా ఏమిటి?

ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో విసిగిపోయిన లేదా దయనీయంగా అనిపించిన సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి. ఇది సాధారణంగా ఒక నిర్దిష్ట కారణం వలన అయి ఉంటుంది, రోజువారీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేయదు, సాధారణంగా ఒకటి లేదా రెండు వారాల కంటే మించి కూడా ఉండదు.

ఏదేమైనా, ఈ భావాలు వారాలు లేదా నెలల పాటు కొనసాగితే, లేదా అవి మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తే, మీకు ఆవేదనకలగవచ్చు. అప్పుడు మీరు సహాయం పొందాల్సి ఉంటుంది.

ఆవేదన సంకేతాలు ఏమిటి?

ప్రజలు వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా ఆవేదనకు గురి కావడం జరుగుతుంది. ఆవేదనలో తేలికపాటి , మితమైన లేదా తీవ్రమైన స్థాయిలు ఉన్నాయి.1

ప్రజలు ఆవేదనకు గురి కావడం అనేది వారి సాంస్కృతిక నేపథ్యం మరియు వారి వ్యక్తిగత విలువలు, నమ్మకాలు మరియు భాష పై కూడా ఆధారపడి ఉంటుంది.

మీరు ఆవేదనకు గురయినట్లయితే, మీరు ఈ క్రింది వాటిలో కొన్నింటిని గమనించడం జరగవచ్చు:1 2

మీ మనసులో, మీరు:

  • అసంతృప్తిగా, విచారంగా, నిరాశగా, నిస్పృహగా అనిపించవచ్చు - ఈ భావన అంత తొందరగా పోదు మరియు రోజులో ఒక నిర్దిష్ట సమయంలో, తరచుగా ఉదయాన్నే మరింత అధ్వాన్నంగా ఉండవచ్చు .
  • మీరు దేనినీ ఆస్వాదించలేరు.
  • వ్యక్తులను కలవాలనే ఆసక్తి కోల్పోవడం మరియు స్నేహితులతో సంబంధాన్ని కోల్పోవడం జరగవచ్చు .
  • సరిగా ఏకాగ్రత లేకపోవడం వలన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.
  • ఆత్మవిశ్వాసం కోల్పోతారు
  • అపరాధ భావన మరియు అనర్హుడిని అని అనిపించడం
  • నిరాశావాదులుగా మారవచ్చు
  • నిరాశగా అనిపించడం ప్రారంభమవుతుంది, బహుశా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించవచ్చు.

మీ శరీరంలో, మీరు క్రింది మార్పులను కనుగొనవచ్చు:

  • స్థిమితం లేనట్లుగా, బలహీనంగా లేదా ఆందోళనగా అనిపించవచ్చు
  • అలసటగా మరియు నిస్సుత్తువుగా అనిపిస్తుంది
  • నిద్రపట్టకపోవచ్చు లేదా ఎక్కువగా నిద్రపోవడం జరుగుతుంది
  • ఉదయాన్నే మేల్కొనడం మరియు/లేదా రాత్రంతా మేల్కొని ఉండటం జరుగుతుంది
  • తలనొప్పి లేదా కడుపు నొప్పి కలిగి ఉండటం జరుగుతుంది
  • సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోతారు
  • తినలేక పోవడం తద్వారా బరువు తగ్గడం లేదా 'కంఫర్ట్ ఈట్' వలన ఎక్కువగా తిని బరువు పెరగడం జరుగుతుంది.

ఇతర వ్యక్తులు మీలో క్రింది అంశాలను గమనించవచ్చు:

  • పని ప్రదేశంలో తప్పులు చేస్తూ ఉంటారు లేదా దానిపై దృష్టి పెట్టలేరు
  • అసాధారణంగా నిశ్శబ్దంగా మరియు ఏమీ పట్టనట్టు ఉంటారు , లేదా ఇతరులకు దూరంగా ఉంటారు
  • సాధారణంగా కంటే ఎక్కువగా విషయాల గురించి ఆందోళన చెందుతుంటారు
  • సాధారణంగా కంటే ఎక్కువ చిరాకుగా ఉంటారు
  • సాధారణంగా కంటే ఎక్కువగా లేదా తక్కువగా నిద్రపోతుంటారు
  • అస్పష్టమైన శారీరక సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు
  • మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోవడం ఆపివేస్తారు - మీరు తలస్నానం చేయడం లేదా మీ బట్టలను ఉతుక్కోవడం వంటివి చేసుకోరు
  • మీ ఇంటిని సరిగ్గా చూసుకోవడం ఆపివేస్తారు - మీరు వంట చేయడం ఆపివేస్తారు, శుభ్రం చేయడం లేదా మీ మంచంపై బెడ్షీట్లను మార్చడం మర్చిపోతూ ఉంటారు.

చాలా మందికి ఇవన్నీ జరగకపోవచ్చు. అలాగే కొంతమంది ఈ శారీరక లక్షణాలను మాత్రం గమనిస్తూ ఉండవచ్చు. మీకు చాలా అలసటగా అనిపించడం లేదా నిద్రకు సంబంధించిన సమస్యలు ఏర్పడటం బట్టి మీకు శారీరక అనారోగ్యం ఉందని మీరు అనుకోవచ్చు, కానీ ఇలాంటి శారీరక లక్షణాలు ఆవేదనఏర్పడటానికి ముందు కనిపించే సంకేతాలలో మొదటి సంకేతం కావచ్చు.1 2

మీరు ఎంత నిరాశకు గురయ్యారో మీరు గ్రహించకపోవచ్చు, ముఖ్యంగా అది మెల్లమెల్లగా మిమ్మల్ని చుట్టుముట్టి నప్పుడు. కొన్నిసార్లు ప్రజలు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. తమ సోమరితనం లేదా తమకు సంకల్పబలం లేకపోవడం గురించి తమను తాము నిందించుకోవడం కూడా ప్రారంభించవచ్చు.

కొన్నిసార్లు నిజంగా సమస్య ఉందని మిమ్మల్ని ఒప్పించడానికి మరియు మీరు సాయ తీసుకోవాలని సూచించడానికి ఒక స్నేహితుడు లేదా భాగస్వామి అవసరపడవచ్చు.

మీరు లేదా స్నేహితుడు లేదా భాగస్వామి గనుక క్రింది విషయాలను గమనించినట్లయితే మీరు సాయ తీసుకోవలసి ఉంటుంది:

  • ఆవేదనలో మీకు కలిగే భావాలు మీ పని, ఆసక్తులను మరియు మీ కుటుంబం మరియు స్నేహితుల పట్ల మీకు కలిగే భావాలను ప్రభావితం చేస్తాయి
  • మీ ఆవేదనభావాలు ఆగకుండా కొనసాగుతుండవచ్చు మరియు మెరుగుపడే దాఖలాలు కనపడకపోవచ్చు
  • జీవితం విలువైనది కాదని లేదా మీరు లేకపోతే ఇతరులు బాగుపడతారని మీరు భావిస్తారు.

ఆందోళన సంగతేమిటి?

కొంతమంది డిప్రెషన్‌కు గురైనప్పుడు కూడా చాలా ఆందోళన చెందుతారు.1 3

మీకు ఎప్పుడూ అలజడిగా ఉన్నట్లు ఉండవచ్చు, ఆందోళనగా, భయం భయం గా ఉండి ఉండవచ్చు. అలాగే బయటకు వెళ్లడం లేదా జనాల మధ్య ఉండటం మీకు కష్టం కావచ్చు. లేదా నోరు పొడిబారడం, చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపులో తిప్పినట్టు ఉండటం వంటి శారీరక లక్షణాలు మీకు అనుభవం లోకి రావచ్చు .

మీరు నిరాశ మరియు ఆందోళనను అనుభవిస్తున్నట్లయితే, మీకు అత్యంత ఇబ్బంది కలిగించేదానికి ముందుగా మీరు చికిత్స పొందుతారు.1

బైపోలార్ డిజార్డర్ (మానిక్ డిప్రెషన్) సంగతేమిటి?

డిప్రెషన్ లో ఉన్న కొంతమంది ఉప్పొంగి పోయినట్లుగా అనిపించి నప్పుడు మితిమీరిన ఉత్సాహం కలిగి అది ఎక్కువ కాలం ఉండవచ్చు. దీన్నే 'ఉన్మాదం' అంటారు మరియు దీని అర్థం మీకు బైపోలార్ డిజార్డర్ (దీనిని మానిక్ డిప్రెషన్ అని పిలుస్తారు) ఉందనే అవకాశం కలదు.4 5

డిప్రెషన్ ఎందుకు వస్తుంది?

డిప్రెషన్ బలహీనతకు సంకేతం కాదు. ఇది అత్యంత నిర్ణయాత్మక సామర్థ్యం గల వ్యక్తులకు కూడా సంభవించవచ్చు - ప్రసిద్ధ వ్యక్తులు, అథ్లెట్లు మరియు ప్రముఖులు కూడా డిప్రెషన్ బారిన పడవచ్చు.

డిప్రెషన్ కు గురికావడానికి కొన్నిసార్లు స్పష్టమైన కారణం ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇది నిరాశ లేదా మనసు విరిగి పోవడం, లేదా మీరు ఏదైనా లేదా మీకు ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల కావచ్చు.

దీనికి తరచుగా ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉంటాయి మరియు ఇవి వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉంటాయి. మేము క్రింద కొన్ని సాధారణ కారణాలను వివరించడం జరిగింది.

జీవిత సంఘటనలు మరియు వ్యక్తిగత పరిస్థితులు

నిరాశ అనేది మరణం, సంబంధాల విచ్ఛిన్నం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన లేదా బాధాకరమైన సంఘటన ద్వారా ప్రేరేపించబడుతుంది.6 7

మీ జీవిత పరిస్థితుల ప్రకారం మీరు ఒంటరిగా నివసిస్తున్నట్లయితే లేదా చుట్టూ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు లేనట్లయితే, మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.8 9

శారీరక ఆరోగ్యం

నిద్ర, ఆహారం మరియు వ్యాయామం అన్నీ మన మానసిక స్థితిని మరియు విషయాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిని ప్రభావితం చేస్తాయి.

శారీరక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా తీవ్రమైన లేదా దీర్ఘకాలికమైనవి, నిరాశకు కారణమవుతాయి లేదా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.10 11 వీటిలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి :

  • క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి ప్రాణాంతక అనారోగ్యాలు
  • ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక మరియు/లేదా బాధాకరమైన అనారోగ్యాలు
  • 'ఫ్లూ' లేదా గ్రంధి జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు - ముఖ్యంగా యువతలో
  • అండర్ ఆక్టివ్థై రాయిడ్ వంటి హార్మోన్ల సమస్యలు
  • మెదడు లేదా నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే పరిస్థితులు.12

చిన్నప్పుడు మనసుకు తగిలిన గాయాలు

కొంతమంది ఇతరులకన్నా నిరాశకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. ఇది కష్టకరమైన బాల్యపు అనుభవాలు లేదా గాయాల వల్ల కావచ్చు, వీటిలో వేదింపులు (శారీరక, లైంగిక లేదా మానసిక), నిర్లక్ష్యం, హింస లేదా బాధాకరమైన సంఘటనను చూడటం లేదా అస్థిరమైన కుటుంబ వాతావరణం మొదలయినవి ఉండవచ్చు.13 14 15

మద్యం మరియు మాదకద్రవ్యాల వాడకం

నిరంతర మరియు అధిక తాగుడు16 17 లేదా గంజాయి18 19 వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించడం వల్ల మీరు కాలక్రమేణా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

జన్యు పరమైన కారకాలు

కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా తీవ్రమైన నిరాశ, బైపోలార్ డిజార్డర్ లేదా స్కిజోఫ్రెనియా ఉన్నాయా అనే దానిని బట్టి ఇలాంటి జన్యు 'ప్రమాద కారకాలు' ఉంటాయి. పర్యావరణ ప్రమాద కారకాలు కూడా ఉంటాయి . అవి జన్యుపరమైన కారకాలతో సంకర్షణ చెంది ఈ పరిస్థితులు మీకు గల ప్రమాదాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి దోహదపడేలా చేస్తాయి.

ఉదాహరణకు, మీకు జన్యుపరమైన ప్రమాద కారకాలు ఉండవచ్చు, అంటే మీరు తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, మీరు స్థిరమైన మరియు సానుకూల వాతావరణంలో పెరిగితే లేదా నివసిస్తుంటే ఇది తీవ్రమైన మానసిక అనారోగ్యాన్ని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తీవ్రమైన డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక అనారోగ్యం గల తల్లిదండ్రులను కలిగి ఉండటం అనేది మీరు కూడా తీవ్రమైన మానసిక అనారోగ్యాన్ని కలిగి ఉండటానికి బలమైన ప్రమాద కారకం కావచ్చు . తీవ్రమైన మానసిక అనారోగ్యం గల తల్లిదండ్రులతో ఉన్న పిల్లలు 3 లో 1 తీవ్రమైన మానసిక అనారోగ్యం కలిగి ఉండే అవకాశం ఉంది.

ఆవేదనఏర్పడటానికి గల కారణాల గురించి ఆలోచించేటప్పుడు, చాలా విభిన్న విషయాలు ఇమిడి ఉన్నాయని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం, మరియు ఏదేనీ ఒకే ఒక్క ప్రమాద కారకం నిరాశకు కారణం కాదు.20

ఆవేదనకు సంబంధించినంత వరకు లింగం మరియు లైంగికతకు సంబంధించిన తేడాలు ఏమైనా ఉన్నాయా?

డిప్రెషన్ అనుభవించే పురుషులు వారి భావాల గురించి మాట్లాడే అవకాశం తక్కువ మరియు సాయ కోరే అవకాశం కూడా తక్కువ.21 వారు ఆకస్మిక కోపం, నియంత్రణ కోల్పోవడం, ఎక్కువ రిస్క్ తీసుకోవడం మరియు దూకుడు, అలాగే సమస్యలను ఎదుర్కోవటానికి మద్యం మరియు మాదకద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా వారి నిరాశను వేరే విధంగా వ్యక్తీకరించవచ్చు.23 24 ఆత్మహత్య ద్వారా మరణించే అవకాశం మహిళల కంటే పురుషులలో ఎక్కువగా ఉంటుంది 21 23

గర్భవతిగా ఉన్న మహిళల్లో సుమారు 12% మంది వారి గర్భధారణ సమయంలో ఆవేదనకలిగి ఉంటారు, అయితే 15–20% మంది శిశువు పుట్టిన మొదటి సంవత్సరంలో ఆవేదనకు గురవుతారు.24

ట్రాన్స్జెండర్ అయిన వ్యక్తులు (పుట్టినప్పుడు కేటాయించిన లింగం కంటే భిన్నమైన లింగంతో గుర్తించబడేవారు) పుట్టినప్పుడు తమకు కేటాయించిన లింగంతోనే గుర్తించేబడే వారి కంటే అధిక స్థాయి ఆవేదనమరియు ఆందోళనను కలిగి ఉండవచ్చు. బైనరీ కాని వ్యక్తులు ( స్త్రీ / పురుషుడిగా గుర్తించబడనివారు ) కూడా అధిక స్థాయిలో ఆవేదనమ రియు ఆందోళనను కలిగి ఉండవచ్చు.25 26

స్వలింగ సంపర్కులైన స్త్రీలు స్వలింగ సంపర్కులైన పురుషులు లేదా ద్విలింగ సంపర్కులుగా గుర్తించే వ్యక్తులు భిన్న లింగ సంపర్కుల కంటే ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యను (ఆవేదనతో సహా) కలిగి ఉంటారు.27  వారు ఆత్మహత్య మరియు స్వీయ-హాని తలపెట్టడానికి ప్రయత్నించే ప్రమాదం కూడా ఎక్కువే.27 28

నేను నా అంతట నేనుగా మెరుగుపడగలనా?

శుభవార్త ఏమిటంటే, ఆవేదనతో బాధపడుతున్న చాలా మంది ప్రజలు తమకుతాము సాయపడే పనులు చేయడం ద్వారా తమంతట తాముగా మెరుగుపడతారు. మీ అంతట మీరే ఆవేదనను అధిగమించగలరు, ఇది మీకు విజయం అనుభూతిని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అది భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా నిరాశగా అనిపిస్తే అటువంటి భావాలను తిరిగి ఎదుర్కోవటానికి సాయపడుతుంది

ఈ కరపత్రంలోని కొన్ని సూచనలను తీసుకోవడం వల్ల మీ ఆవేదనకాలం తగ్గుతుంది మరియు భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడుతుంది.

కానీ కొంతమందికి అదనపు సాయం అవసరపడుతుంది, ముఖ్యంగా వారి నిరాశ తీవ్రంగా ఉంటే లేదా అది చాలా కాలం పాటు కొనసాగితే, లేదా వారు మెరుగుపడటానికి ప్రయత్నించిన విషయాలు పనిచేయకపోతే.

మీరు ఆవేదనను కలిగి ఉండటం ఇదే మొదటిసారి అయితే, మీరు మళ్ళీ ఆవేదనకు గురయ్యే అవకాశం సుమారు 50:50 ఉంటుంది, కాబట్టి మీకు అవసరమైతే సాయం ఎలా పొందాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.1, 29

కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందనే దాని గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటే, దానిని వాయిదా వేయకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ పనులు మీరు చేసుకోవడానికి మరియు జీవితాన్ని ఎప్పటిలా తిరిగి ఆస్వాదించడానికి మీకు సాయపడుతుంది.

కొన్నిసార్లు మీరు ఎలా భావిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ఇతరులకు కొంత సమయం పట్టవచ్చు. పట్టుదలగా ఉండండి మరియు పట్టుదలను వదులుకోవద్దు – మీరు సరైన సాయం పొందవచ్చు.

నాకు నేను ఎలా సాయపడగలను?

మీరు నిరాశకు గురైనప్పుడు ప్రయత్నించగల కొన్ని సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి. మీకు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో కనుగొనడం మరియు మీ స్వంత సాయక వ్యూహాల జాబితాను రూపొందించడం చాలా ముఖ్యం.

ఎవరితోనైనా మాట్లాడండి: మీకు మీ జీవితంలో ఏదైనా చెడు వార్త అందినపుడు లేదా పెద్దగా కలత చెందే సంఘటన జరిగినప్పుడు, విషయాలను లోలోపల ఉంచుకోడానికి ప్రయత్నించకండి. మీరు దాని గురించి ఎలా భావిస్తున్నారో మీకు దగ్గరగా ఉన్నవారికి చెప్పుకోవడం మీకు సాయపడుతుంది. మీరు ఎవరితోనూ మాట్లాడలేరని మీకు అనిపిస్తే, మీకు ఎలా అనిపిస్తుందో దానిని ఒకచోట రాయడానికి ప్రయత్నించండి.

చురుకుగా ఉండండి: మీకు వీలైతే, కొంత వ్యాయామం కోసం బయటకు వెళ్లండి, అది కొద్దిపాటి నడక కోసం మాత్రమే అయినా సరే. ఇది మిమ్మల్ని శారీరకంగా ఫిట్‌గా ఉంచడానికి మరియు బాగా నిద్రపోవడానికి సాయపడుతుంది. బాధాకరమైన ఆలోచనలు మరియు భావాలపై కాకుండా ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి ఇది మీకు సాయపడుతుంది.

బాగా తినండి : మీకు చాలా ఆకలి అనిపించకపోవచ్చు, కానీ క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి. మీరు నిరాశకు గురైనప్పుడు బరువు తగ్గడం మరియు విటమిన్లు తక్కువవటం జరుగుతుంది – లేదా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం మీకు ఇష్టం లేకుండా బరువును పెంచుకోవడం జరుగుతుంది. మరిన్ని పండ్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం మీ శరీరం మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

ఆల్కహాల్ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి: ఆల్కహాల్ మీకు కొన్ని గంటలు మంచి అనుభూతిని కలిగిస్తుంది, కానీ ఇది వాస్తవానికి దీర్ఘకాలికంగా నిరాశను మరింత తీవ్రతరం చేస్తుంది. సులభంగా దొరికే మాదకద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయి, యాంఫేటమిన్లు, కొకైన్ మరియు ఎక్స్టసీకి కూడా ఇది వర్తిస్తుంది.

రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం దినచర్యగా మార్చుకోండి : ప్రతి రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి మరియు ప్రతిరోజూ ఉదయం ఒకే సమయానికి లేవండి. విశ్రాంతిగా సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం వంటి పడుకునే ముందు మీరు ఆనందించే, మీకు విశ్రాంతిని కలిగించే పనులను చేయండి. మీకు నిద్ర రాకపోతే, మంచం నుండి లేచి సోఫాలో నిశ్శబ్దంగా కూర్చోవడం వంటి ప్రశాంతంగా చేసే పని ఏదైనా చేయండి.

విశ్రాంతి కల్పించే కార్యకలాపాలను ప్రయత్నించండి: మీకు ఎప్పుడు చూసినా ఆందోళన గా ఉన్నట్లు అనిపిస్తే, విశ్రాంతిని కల్పించే వ్యాయామాలు, యోగా, మసాజ్, అరోమాథెరపీ లేదా మీకు విశ్రాంతిగా అనిపించే మరేదైనా ఒక కార్యకలాపాన్ని ప్రయత్నించండి.

మీకు ఆనందం కలిగించేది ఏదైనా చేయండి: మీరు నిజంగా ఆనందించేదాన్ని చేయడానికి రోజూ కొంత సమయం తీసుకోండి – ఒక ఆట ఆడటం, చదవడం లేదా ఏదైనా ఒక హాబీ వంటివి.

ఆవేదన గురించి చదవండి: ఆవేదన గురించి చాలా పుస్తకాలు, వెబ్‌సైట్లు ఉన్నాయి. ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి అవి మీకు సాయపడతాయి, ఆవేదనను బాగా ఎదుర్కోవటానికి మీకు వ్యూహాలను అందిస్తాయి మరియు మీకు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి స్నేహితులు మరియు బంధువులకు కూడా అవి సాయపడతాయి.

మీపై మీరు దయ కలిగి ఉండటం ఎలా అనేది అభ్యసించండి:  మిమ్మల్ని మీరు కూడా చాలా కష్టపెట్టించే ఒక పర్ఫెక్షనిస్ట్ కావచ్చుమీరు . మీ కొరకు మీరు మరింత వాస్తవిక లక్ష్యాలు లేదా అంచనాలను సెట్ చేయడానికి ప్రయత్నించండి. మీ పట్ల మీరు మరింత దయగా ఉండండి.

ఒక బ్రేక్తీ సుకోండి: కొన్ని రోజులు మీ సాధారణ దినచర్య నుండి బయటపడి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది నిజంగా సాయపడుతుంది. మీ కొరకు మీరు రోజువారీ ఒత్తిడి మరియు ఆందోళనల నుండి ఒక బ్రేక్ ఇవ్వండి. మీరు మీ వాతావరణాన్ని మార్చగలిగితే, కొన్ని గంటలు కూడా, అది సాయపడుతుంది.

ఏదైనా ఒక సాయక బృందంలో చేరండి: మీరు నిరాశకు గురైనప్పుడు మీకు మీరు సాయం చేసుకోవడం కష్టం కావచ్చు . ఇదే లాంటి పరిస్థితిలో ఉన్న ఇతర వ్యక్తులతో మాట్లాడటం సాయపడవచ్చు . కొత్త ఆలోచనల కోసం ఈ కరపత్రం చివర ఉన్న సంస్థల జాబితాను చూడండి.

ఆశావహంగా ఉండండి: చాలా మంది ప్రజలు నిరాశకు గురయ్యారని మరియు మెరుగుపడ్డారని గుర్తుంచుకోండి – సాయం అనేది అందుబాటులో ఉంది మరియు మీరు మెరుగైన అనుభూతి చెందడానికి అవసరమైన సాయానికి మీరు అర్హులు.

ఆవేదననుండి బయటపడడానికి నేను ఏ రకమైన సాయం పొందగలను?

మీ అంతట మీరు మెరుగుపడటానికి ప్రయత్నించడం వలన ఫలితం లేకపోయినా లేదా మీరు కోరుకున్నంత త్వరగా ఫలితం కనిపీంచకపోయినా మీ GPతో మాట్లాడటం మంచిది.

ఆవేదనఉన్న చాలా మందికి వారి GP ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది . మీకు ఎవరైనా ఒక రెగ్యులర్ GP లేకపోతే, మీ వద్ద స్థానికంగా ప్రాక్టీస్ చేసే మరియు మీకు సౌకర్యంగా అనిపించే ఒక వైద్యుడిని కనుగొనడానికి ప్రయత్నించండి. మీరు క్రమం తప్పకుండా అతనిని కలుస్తూ ఉండవచ్చు.

మీ లక్షణాలను సమీక్షించడానికి మరియు మీ కోసం ఏ చికిత్సలు పనిచేస్తాయో తెలుసుకోవడానికి మీ GP మీతో మాట్లాడతారు.

మీకు అందించే ఉత్తమ చికిత్స అనేది మీ ప్రస్తుత ఆవేదనయి, అది ఎంతకాలం కొనసాగింది మరియు మీకు గతంలో ఎప్పుడైనా ఆవేదన ఏర్పడిందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మీ GP మీకు సరైన శారీరక చెకప్కూ డా అందిస్తారు ఎందుకంటే కొన్ని శారీరక అనారోగ్యాలు ఆవేదన‌కు కారణమవుతాయి. మీరు ఇప్పటికే ఏదైనా శారీరక అనారోగ్యానికి చికిత్స పొందుతుంటే, మీ GP దాని గురించి తెలుసుకోవలసి ఉంటుంది .

ప్రారంభ చికిత్స (తేలికపాటి ఆవేదన)

మీరు మొదటిసారి ఆవేదన‌ను ఎదుర్కొంటుంటే, మీకు సాధారణంగా యాంటీడిప్రెసెంట్ ఇవ్వబడదు. మీ GP తక్కువ-తీవ్రత కలిగిన మానసిక పరమైన జోక్యాన్ని (లేదా మాట్లాడే చికిత్స) మీకు సూచించవచ్చు:1 2

  • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) సూత్రాల ఆధారంగా స్వీయ-సాయ కరపత్రాలు లేదా పుస్తకాలు (ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణుడి ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది )
  • సెల్ఫ్ హెల్ప్ కంప్యూటరైజ్డ్ CBT ప్రోగ్రామ్‌లు (ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ద్వారా కూడా మద్దతు ఇవ్వబడుతుంది)
  • సమూహ-ఆధారిత వ్యాయామం
  • పీర్ సపోర్ట్ సెల్ఫ్-హెల్ప్ లేదా CBT ఆధారంగా జరిగే ఒక సమూహ-ఆధారిత ప్రోగ్రామ్.

మీ కోసం సరైనదాన్ని ఎంచుకోవడానికి మీ GP మీకు సాయపడుతుంది.

ఇవి మీకు బాగా పని చేయకపోతే, మీ GP మితమైన మరియు తీవ్రమైన ఆవేదనకొరకు ఉద్దేశించిన చికిత్సలలో భాగంగా తదుపరి విభాగంలోని జోక్యాలలో ఒకదాన్ని ప్రయత్నించమని సూచించవచ్చు.

తదుపరి చికిత్స (మితమైన మరియు తీవ్రమైన ఆవేదన)

మీ GP అధిక-తీవ్రత కలిగిన మానసిక జోక్యం లేదా యాంటీడిప్రెసెంట్ మందులు లేదా రెండింటినీ ప్రయత్నించమని సూచించవచ్చు.1 మీకు ఏది సరైన చికిత్స అని నిర్ణయించడానికి మీరు వారితో మాట్లాడవచ్చు.

మానసిక జోక్యాలు

ఆవేదనఉన్నవారికి అనేక రకాల మానసిక జోక్యాలు ఉన్నాయి మరియు స్థానికంగా అందుబాటులో ఉన్న వాటికి మిమ్మల్ని సూచించవచ్చు.1

మీరు ఒక నిర్దిష్ట మానసిక జోక్యాన్ని స్వీకరించడానికి మీ పేరు వెయిట్‌లిస్ట్ లో గనుక ఉంటే, ఈలోగా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మీరు ఏమి చేయవచ్చనే దాని గురించి మీరు మీ వైద్యుడితో మాట్లాడాలి.

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT)

మనలో చాలా మందికి నెగెటివ్ థింకింగ్ అలవాట్లు ఉంటాయి, అవి జీవితంలో జరిగే వాటికి భిన్నంగా ఉండి మనల్ని నిరాశకు గురి చేస్తాయి మరియు మనలను నిరాశగా ఉంచుతాయి. సిబిటి మీకు క్రింది విధంగా సాయపడుతుంది:

  1. ఏదైనా అవాస్తవిక మరియు పనికిరాని ఆలోచనా విధానాలు ఉంటే వాటిని గుర్తించండి
  2. అప్పుడు ఆలోచించడానికి మరియు ప్రవర్తించడానికి కొత్త, మరింత సాయకరమైన మార్గాలను అభివృద్ధి చేయండి.

ఆవేదనకు చికిత్సగా CBT ఉత్తమ ఆధారాలను కలిగి ఉంది.1 30 31

ఇంటర్ పర్సనల్ థెరపీ (IPT)

కుటుంబం, మీ భాగస్వామి మరియు స్నేహితులతో మీకు గల సంబంధాలలో ఏవైనా సమస్యలుంటే తెలుసుకుని వాటిని గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి ఇంటర్ పర్సనల్ థెరపీ మీకు సాయపడుతుంది.

ప్రవర్తన పరమైన క్రియాశీలత

ప్రవర్తన పరమైన క్రియాశీలత అనేది కార్యకలాపాలను ప్లాన్ చేయడం మరియు మీరు సాధారణంగా చేయకుండా ఉండే నిర్మాణాత్మక పనులు చేయడం వంటి మరింత సానుకూల ప్రవర్తనను పెంపొందించుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

జంటల చికిత్స

మీరు మీ ఆవేదనను ప్రభావితం చేసే సంబంధంలో గనుక ఉంటే ఆవేదనమరియు మీ సంబంధం మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడంలో మీకు సాయపడటానికి జంటల చికిత్స తగినది కావచ్చు. ఇది మీ భాగస్వామితో మరింత సాయక సంబంధాన్ని నిర్మించుకోవడంలో మీకు సాయపడుతుంది.

కౌన్సిలింగ్

శిక్షణ పొందిన కౌన్సిలర్లు మీ వ్యాధి లక్షణాలు మరియు సమస్యలను అన్వేషించడంలో మీకు సాయపడగలరు మరియు మీకు మద్దతు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

సైకోడైనమిక్ సైకోథెరపీ

మీ గత అనుభవాలు ఇక్కడ మరియు ఇప్పుడు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడటానికి ఈ చికిత్స మీకు సాయపడుతుంది.

యాంటీడిప్రెసెంట్‌లు

మీ ఆవేదనమితమైనది లేదా తీవ్రమైనది లేదా ఎక్కువ కాలం కొనసాగుతుంది అంటే మీ వైద్యుడు మీకు యాంటీడిప్రెసెంట్‌ల కోర్సును సూచించవచ్చు, సాధారణంగా అది ఒక సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (SSRI).1 32 మీకు ఏ యాంటీడిప్రెసెంట్ ఉత్తమంగా పనిచేస్తుందనే దాని గురించి వారు మీతో మాట్లాడతారు – మీరు ఇతర మందులు తీసుకున్నారా, మరియు మీకు ఏవైనా ఇతర శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మరియు మీరు గతంలో ఏవైనా యాంటీడిప్రెసెంట్‌లు తీసుకున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

యాంటీడిప్రెసెంట్‌లు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయా?

అన్ని మందుల మాదిరిగానే, యాంటీడిప్రెసెంట్‌లు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అయినప్పటికీ అవి సాధారణంగా తేలికపాటివి అయి ఉంటాయి మరియు కొన్ని వారాల తర్వాత కనుమరుగవుతాయి.32 33

ఏమి ఆశించవచ్చు అనే దానిపై మీ డాక్టర్ మీకు సలహా ఇవ్వగలరు మరియు మీకు ఆందోళన కలిగించేది ఏదైనా ఉంటే లేదా మీరు చాలా రకాలైన దుష్ప్రభావాలను ఎదుర్కొంటుంటే మీరు వారితో మాట్లాడాలి. మీరు మీ ఫార్మసిస్ట్ నుండి మందులపై రాతపూర్వక సమాచారాన్ని కూడా పొందుతారు.

ఏదైనా ఒక యాంటీడిప్రెసెంట్ మీకు నిద్రను కలిగిస్తే, మీరు దానిని రాత్రిపూట తీసుకోవాలి, అప్పుడు అది మీకు నిద్రపోవడానికి సాయపడుతుంది. అయినప్పటికీ, మీకు పగటిపూట నిద్ర అనిపిస్తే, ఆ ప్రభావం తగ్గే వరకు మీరు డ్రైవింగ్ చేయకూడదు లేదా ఏవేనీ యంత్రాలపై పని చేయకూడదు. మీరు మాత్రలు తీసుకునేటప్పుడు మద్యం తాగితే మీకు చాలా నిద్ర వస్తుంది, కాబట్టి దీనిని నివారించడం మంచిది.34

కొన్ని ఇతర మందులు లేదా డ్రగ్స్ (నికోటిన్ లేదా ఆల్కహాల్ వంటివి) మాదిరిగా కాకుండా , మీరు యాంటీడిప్రెసెంట్ కోసం ఆరాటపడరు లేదా అదే ప్రభావాన్ని పొందడానికి మీరు ఎక్కువ తీసుకోవాలని భావించరు.1

నేను ఎంతకాలం ఒక యాంటీడిప్రెసెంట్ ను తీసుకోవలసి ఉంటుంది ?

మొదట, చికిత్స పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి మీ డాక్టర్ మిమ్మల్ని క్రమం తప్పకుండా చూడవలసి ఉంటుంది (మొదటి 2 వారాల తర్వాత, తరువాత మొదటి 3 నెలలకు 2–4 వారాల మధ్య, తరువాత తక్కువ తరచుగా).1

మీకు ఆత్మహత్య చేసుకొనే ఆలోచనలు ఉంటే, లేదా మీరు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు అయితే, మీ డాక్టర్ మిమ్మల్ని తరచుగా చూడాలనుకోవచ్చు (సాధారణంగా వారానికి ఒకసారి). ముఖ్యంగా మీరు గనుక చిన్నవయసు వారయినట్లయితే, కొన్ని యాంటీడిప్రెసెంట్‌లు ప్రారంభంలో ఆత్మహత్య ఆలోచనలను పెంచుతాయి,1

యాంటీడిప్రెసెంట్‌లు తీసుకోవడం మీకు గనుక సాయపడితే, మీకు మధ్యలో బాగా అనిపించినప్పటికీ, మీరు కనీసం 6 నెలల పాటు వాటిని తీసుకోవడం కొనసాగించాలి. ఆవేదనతిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ఇది సాయపడుతుంది.1

మీరు గతంలో ఆవేదనకు గురైన వారయితే మీరు ఇంతకంటే ఎక్కువసేపు వాటిని వాడవలసి ఉంటుంది. మీరు వాటిని తీసుకోవడం ఎప్పుడు ఆపవచ్చు మరియు దీన్ని ఎలా సురక్షితంగా చేయాలో మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు.

మీరు అకస్మాత్తుగా యాంటీడిప్రెసెంట్ తీసుకోవడం ఆపివేస్తే, మీకు ఉపసంహరణ లక్షణాలు అనుభవం లోనికి రావచ్చు . వీటిలో నిద్ర, ఆందోళన, మైకము లేదా కడుపు నొప్పులు రావడం వంటివి ఉంటాయి .1

మీరు తీసుకుంటున్న యాంటీడిప్రెసెంట్ పని చేస్తుందని మీకు అనిపించకపోతే (వాటిని తీసుకున్న 3 నుండి 4 వారాల తర్వాత), మీ వైద్యునితో మాట్లాడండి, వారు మీ మోతాదును మార్చవచ్చు లేదా మీకు వేరే రకమైన యాంటీడిప్రెసెంట్ లేదా మందులను అందించవచ్చు.1

మరింత సాయం పొందడం (తీవ్రమైన ఆవేదన)

ఆవేదన‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు వారి GP నుండి అవసరమైన సాయం పొందుతారు. మీ GP ద్వారా చికిత్స పొందిన తర్వాత మీ ఆవేదన మెరుగుపడకపోతే మరియు మీకు నిపుణుల సాయం మరింత అవసరపడితే, మీరు దానిని నిపుణులైన మానసిక ఆరోగ్య సేవ లేదా బృందానికి సూచించబడవచ్చు.1

మానసిక ఆరోగ్య నిపుణులు మీ సాధారణ నేపథ్యం గురించి మరియు మీరు గతంలో ఏవైనా తీవ్రమైన అనారోగ్యాలు లేదా భావోద్వేగ సమస్యలు ఎదుర్కొని ఉంటే వాటి వివరాలను తెలుసుకోవాలనుకుంటారు.

వారు మీ జీవితంలో ఇటీవల కాలంలో ఏమి జరుగుతోంది, ఆవేదన ఎలా ఏర్పడింది మీరు ఇప్పటికే దీనికి ఏదైనా చికిత్స పొంది ఉన్నారా అని అడుగుతారు.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఇచ్చే సమాచారం వైద్యుడికి మిమ్మల్ని ఒక వ్యక్తిగా తెలుసుకోవడంలో సాయపడుతుంది మరియు మీకు ఏది మంచి ఎంపిక అనేది తెలుసుకోవడానికి అది సాయపడుతుంది.

మీ ఆవేదనతీవ్రంగా ఉంటే లేదా మీకు నిపుణుల చికిత్స అవసరమైతే, మీరు చికిత్స పొందేందుకు ఆసుపత్రికి రావాల్సి రావచ్చు. మీ సంరక్షణ బృందం మీకు సరైన చికిత్స మరియు మద్దతు అందేలా చూస్తారు.

ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ECT)

ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ (సంక్షిప్తంగా ECT) ఎక్కువగా క్రింది వాటికి చికిత్సగా ఉపయోగిస్తారు:

  • ఒక వ్యక్తి ప్రాణానికి ప్రమాదం ఉంటేమరియు వారికి తక్షణ చికిత్స అవసరమైతే అది తీవ్రమైన ఆవేదన
  • ఏవిధమైన ఇతర చికిత్స పని చేయనప్పుడు అది మితమైన లేదా తీవ్రమైన ఆవేదన.1

ECT లో మెదడు గుండా విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపచేయడం జరుగుతుంది, కాబట్టి అది జనరల్ అనస్థీషియా క్రింద ఆసుపత్రిలో ఇవ్వబడుతుంది. ECT తర్వాత కొంతమందికి తాత్కాలికంగా జ్ఞాపకశక్తి పరమైన సమస్యలు ఉంటాయి.

ప్రత్యామ్నాయ నివారణలు

సెయింట్ జాన్స్ వోర్ట్ అనేది ఆరోగ్య-ఆహార దుకాణాలు మరియు ఫార్మసీల నుండి లభించే ఒక మూలికా ఔషధం మరియు దీనిని ఆవేదనకోసం కొంతమంది ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా డాక్టర్లు ఇవ్వరు లేదా వాడమని చెప్పరు ఎందుకంటే:

  • ఆవేదన‌కు ఇవ్వవలసిన సరైన మోతాదుకు సంబంధించిన వివరాలలో స్పష్టత లేదు
  • వాటిలో ఉన్న పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు వేరువేరుగా ఉండవచ్చు
  • ఇతర మందులతో (ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు యాంటీకాగులంట్స్, లేదా యాంటీ కన్వల్సెంట్లు) కలిపి తీసుకున్నప్పుడు ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.1

మీకు మరిన్ని సలహాలు అవసరపడితే, మీరు దానిని మీ GP లేదా ఫార్మసిస్ట్‌తో చర్చించాలి.

ఆవేదన‌కు గురైన ఎవరైనా ఒక వ్యక్తికి నేను ఎలా సాయపడగలను?

  • వారు చెప్పేది వినండి. ఇది చెప్పినంత సులభం కాదు. మీరు ఒకే విషయాన్ని పదేపదే వినవలసి రావచ్చు . సమాధానం మీకు పూర్తిగా స్పష్టంగా కనిపించినప్పటికీ, అడిగితే తప్ప సలహా ఇవ్వకపోవడం అనేది సాధారణంగా మంచిది. ఆవేదనఒక నిర్దిష్ట సమస్య వల్ల వచ్చినట్లయితే, మీరు ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో లేదా ఆ కష్టాన్ని పరిష్కరించడానికి కనీసం ఒక మార్గాన్ని కనుగొనడంలో సాయపడవచ్చు.
  • వారితో కొంత సమయం గడపండి. ఆవేదన‌లో ఉన్న వారితో కొంత సమయం గడపడం అనేది వారికి సాయపడుతుంది. మీరు వారి కోసం ఉన్నారని వారికి తెలియజేయడం అనేది వారిని మాట్లాడేలా ప్రోత్సహించడానికి మరియు వారు మంచి అనుభూతి చెందే పనులు చేస్తూ ఉండటానికి సాయపడుతుంది.
  • వారికి తిరిగి భరోసా ఇవ్వండి. ఆవేదన‌కు గురైన ఎవరైనా తాము ఎప్పటికైనా మెరుగుపడగలమని నమ్మడం కష్టం. వారు బాగుపడతారని మీరు వారికి భరోసా ఇవ్వవచ్చు, కానీ మీరు ఆ భరోసా ను మళ్ళీ మళ్ళీ ఇవ్వవలసి ఉంటుంది.
  • వారి స్వీయ సంరక్షణకు మద్దతు ఇవ్వండి. వారు తగినంత ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారని మరియు క్రమం తప్పకుండా తింటున్నారని, వారి ఆహారంలో సరైన మోతాదులో పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయని నిర్ధారించుకోండి. అందులోంచి బయటకు రావడానికి మరియు కొంత వ్యాయామం లేదా ఇతర ఆహ్లాదకరమైన కార్యకలాపాలు చేయడానికి మీరు వారికి సాయపడగలరు, ఇది వారు తమ భావాలను ఎదుర్కోవటానికి మద్యం లేదా మాదకద్రవ్యాలను ఉపయోగించడం కంటే ఒక మంచి ప్రత్యామ్నాయం.
  • వారిని సీరియస్‌‌గా తీసుకోండి. వారి పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే మరియు వారు జీవించడం ఇష్టం లేదని మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తమకు తాము హాని కలిగించుకోబోతున్నారు అనే ఆలోచన మీకు కలిగిస్తే, మీరు వాటిని తీవ్రంగా పరిగణించండి. వారు తమ డాక్టరుకి అన్నీ చెప్పగలుగుతున్నారనేది నిర్ధారించుకోండి
  • సాయం పొందేలా వారిని ప్రోత్సహించండి. వారు డాక్టరును కలిసేలా , వారికి ఇవ్వబడిన మందులు తీసుకునేలా లేదా వారి చికిత్సకుడు లేదా కౌన్సిలర్‌తో మాట్లాడేలా వారిని ప్రోత్సహించండి. వారు తమ చికిత్స గురించి ఆందోళన చెందుతుంటే, దానిని తమ డాక్టరుతో చర్చించమని వారిని ప్రోత్సహించండి.
  • మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నిరాశకు గురైన వ్యక్తికి మద్దతు ఇవ్వడం భావోద్వేగపరంగా మీపై కొంత ఒత్తిడి కలిగిస్తుంది, కాబట్టి మీరు మీ స్వంత మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా చూసుకుంటున్నారనేది నిర్ధారించుకోండి.

మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారని మీరు ఆందోళన చెందుతుంటే

ఆవేదనఉన్న కొద్దిమంది ఆత్మహత్యకు ప్రయత్నించవచ్చు లేదా చనిపోవచ్చు.35 36

మీరు ఎవరి గురించి అయినా ఆందోళన చెందుతుంటే, ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు మరియు భావాల గురించి వారితో మాట్లాడటం మరియు వాటిని తీవ్రంగా పరిగణించటం చాలా ముఖ్యం. 

ఎవరినైనా మీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడగడం వారి మనస్సులో అలాంటి ఆలోచనను రేకెత్తించడం లేదా వారు వారి ఆలోచనలను అమలు చేసే అవకాశం ఉందని కాదు.37 38

మీరు ఇంకా ఎవరి గురించి అయినా ఆందోళన చెందుతుంటే, మరింత మద్దతు మరియు సలహా కోసం మీరు క్రింది సేవలలో ఒకదాన్ని సంప్రదించవచ్చు.

జీరో సూసైడ్ అలయన్స్. ఇది ఆత్మహత్య అవగాహన మరియు నివారణకు సంబంధించిన ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తుంది, అది ఆందోళన చెందుతున్న వ్యక్తికి మద్దతు ఇవ్వాలనుకునే వ్యక్తులకు ఒక ప్రారంభ స్థలంగా వ్యవహరిస్తుంది.

ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కలిగినప్పుడు సాయం పొందడం

మీకు ఇప్పటికిప్పుడు ఏదైనా కొంత మద్దతు అవసరమైతే, మీకు సాయపడే సేవలు ఉన్నాయి:

UK-అంతటా

వేల్స్

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోగలరని మీకు అనిపించకపోతే, మరియు మీకు సాయపడటానికి ఇతర ఏవిధమైన మద్దతు సరిపోకపోతే, 999కు కాల్ చేయండి లేదా మీ సమీప ఆసుపత్రి A & E విభాగానికి (కొన్నిసార్లు అత్యవసర విభాగం అని పిలుస్తారు) వెళ్ళండి. లేదా, మీ కోసం 999 కు కాల్ చేయమని లేదా మిమ్మల్ని A&Eకు తీసుకెళ్లమని మీరు వేరొకరిని ఎవరినైనా అడగవచ్చు.

తదుపరి సాయం

అసోసియేషన్ ఫర్ పోస్ట్‌నేటల్ ఇల్నెస్ (APNI) :  ప్రసవానంతర ఆవేదనఉన్న తల్లులకు APNI మద్దతు ఇస్తుంది. ఇది పరిస్థితి గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి మరియు దానికి గల కారణం మరియు స్వభావంపై పరిశోధనను ప్రోత్సహించడానికి ఏర్పడినది.  హెల్ప్‌లైన్: 0207 386 0868 (సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు).

బ్లాక్, ఆఫ్రికన్ అండ్ ఏషియన్ థెరపీ నెట్వర్క్ (BAATN): నల్లజాతీయులు, ఆఫ్రికన్, దక్షిణాసియా మరియు కరేబియన్ ప్రజలకు తగిన మానసిక సేవల ప్రాప్యతకు సంబంధించిన అసమానతలను పరిష్కరించే లక్ష్యంతో UKలో లో ఏర్పడిన ఒక అతిపెద్ద స్వతంత్ర సంస్థ. వారు మానసిక ఆరోగ్యంపై సమాచారాన్ని, ఒక డైరెక్టరీని అందిస్తారు, దానిలో థెరపిస్టులు, సంఘటనలు, శిక్షణ మరియు ఇతర వనరుల గురించి సమాచారం పొందుపరచబడి ఉంటుంది . ఇమెయిల్: connect@baatn.org.uk

CALM (కేంపైన్ ఎగైనెస్ట్ లివింగ్మి జరబ్లీ): ఇది యువతలో ఆవేదనమరియు ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలపై పోరాడటం పై దృష్టి సారించిన ఒక జాతీయ ప్రచార వేదిక . కాన్ఫిడెన్షియల్ హెల్ప్‌లైన్: 0800 58 58 58 (సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకు, వారానికి 7 రోజులు).

ఆవేదన UK: ఆవేదన ఉన్నవారికి సాయం చేసే ఒక జాతీయ పరస్పర మద్దతు సమూహం.  ఇమెయిల్: info@depressionuk.org

పురుషుల ఆరోగ్య వేదిక: ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్‌లలో పురుషుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఒక స్వచ్ఛంద సంస్థ, ఇది పరిశోధన ద్వారా, పురుషుల ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడం మరియు ఆరోగ్య సమాచారం మరియు సలహాలను అందించడం చేస్తుంది . ఫోన్: 020 7922 7908.

మెంటల్ హెల్త్ ఫోరం: ఒకే అనుభవం ఉన్న వ్యక్తుల నుండి ప్రజలు పరస్పర మద్దతును పొందడానికి వీలు కల్పించే ఒక ఆన్‌లైన్‌ కమ్యూనిటీ.

మైండ్: ఇది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు సలహా మరియు మద్దతును అందించే ఒక మానసిక ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ, అలాగే స్థానిక పీర్ సపోర్ట్ గ్రూపుల గురించిన సమాచారం అందిస్తుంది   హెల్ప్‌లైన్: 0300 123 3393 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు). ఇతరులకు సపోర్ట్ చేసే వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో కూడా సమాచారం అందిస్తుంది. మీరు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉండే మానసిక ఆరోగ్య సేవను కనుగొనడంలో లోకల్ మైండ్స్ మీకు సాయపడతారు.

మైండ్ అవుట్: లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ అండ్ క్వీర్ (LGBTQ) వ్యక్తుల కోసం నిర్వహించే ఒక మానసిక ఆరోగ్య సేవ. వారు సలహాలు మరియు సమాచారం, ఆన్‌లైన్‌ మద్దతు, కౌన్సెలింగ్, పీర్ సపోర్ట్ మరియు న్యాయపరమైన సాయాన్ని అందిస్తారు. ఫోన్: 01273 234 839 Email: info@mindout.org.uk

NHS: మానసిక ఆరోగ్య సేవలను ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలిపే సమాచారం

పాపిరస్ హోప్‌లైన్ UK: ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలను ఎదుర్కొంటున్న లేదా అలా ఎదుర్కునే వారి గురించి ఆందోళన చెందుతున్న 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మద్దతు, ఆచరణాత్మక సలహాలు మరియు సమాచారాన్ని అందించే వృత్తిపరమైన సిబ్బందితో కూడిన ఒక హెల్ప్‌లైన్. హోప్‌లైన్: 0800 068 41 41.

రీడింగ్ వెల్ ఏజెన్సీ: ప్రిస్క్రిప్షన్‌పై పుస్తకాలు: స్వయం సాయక పఠనాన్ని ఉపయోగించి ప్రజలు తమంతట తాముగా తమ బాగోగులు చూసుకోవడానికి సాయపడే పథకం. ఇది రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్టులతో సహా ఆరోగ్య నిపుణులచే ఆమోదించబడింది మరియు పబ్లిక్ లైబ్రరీల ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది.

రిలేట్ : రిలేషన్షిప్ సపోర్ట్ అందించే UK అతిపెద్ద సంస్థ. పలు రకాల కౌన్సెలింగ్ సేవలను అందిస్తోంది. విచారణలు: 0300 003 0396.

సమారిటన్లు: UK మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఒక జాతీయ స్వచ్ఛంద సంస్థ, ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే లేదా ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా గోప్యంగా భావోద్వేగ పరమైన మద్దతును అందిస్తుంది.  హెల్ప్‌లైన్: 116 123. ఇమెయిల్: jo@samaritans.org

SaneLine: మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు భావోద్వేగ పరమైన మద్దతు మరియు సమాచారాన్ని అందించే జాతీయ టెలిఫోన్ హెల్ప్‌లైన్.  హెల్ప్‌లైన్: 0300 304 700 (ప్రతిరోజూ సాయంత్రం 4.30 నుండి 10.30 వరకు). ఇమెయిల్: support@sane.org.uk

స్టోన్‌వాల్: సేవలు మరియు స్థానిక సమూహాల సమాచారంతో సహా LGBTQ+ కమ్యూనిటీలకు సమాచారం మరియు మద్దతును అందిస్తుంది. ఫ్రీఫోన్: 0800 050 2020 (సోమవారం నుండి శుక్రవారం వరకు, 9:30-4:30) ఇమెయిల్ info@stonewall.org.uk

స్విచ్‌బోర్డ్: మానసిక ఆరోగ్యంతో పాటు లైంగికత మరియు/లేదా లింగపరమైన గుర్తింపుకు సంబంధించిన సమస్యలను చర్చించాలనుకునే ఎవరికైనా సమాచారం, మద్దతు మరియు రిఫరల్ సేవను అందించే ఒక LGBTQ+ హెల్ప్‌లైన్. వారు ఒక ఆన్‌లైన్ చాట్, ఫోన్‌లైన్‌ను అందిస్తారు: 0300 330 0360 (ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు) ఇమెయిల్: chris@switchboard.lgbt

యంగ్ మైండ్స్: 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు యువకులందరి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్న ఒక జాతీయ స్వచ్ఛంద సంస్థ. పేరెంట్స్ హెల్ప్‌లైన్: 0808 802 5544 (సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు).

జీరో సూసైడ్ అలయన్స్: ఆందోళన చెందుతున్న వ్యక్తికి మద్దతు ఇవ్వడంలో సాయపడటానికి ఆత్మహత్య పై అవగాహనను పెంపొందించి దాని నివారణ కొరకు అవసరమైన ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తుంది.

ఆమోదాలు

RCPsych పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఎడిటోరియల్ బోర్డు, నేషనల్ కోఆపరేటివ్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ ద్వారా సంయుక్తంగా నిర్మించబడినది.

సిరీస్ ఎడిటర్: డాక్టర్ ఫిల్ టిమ్స్

సిరీస్ మేనేజర్: థామస్ కెన్నెడీ

© అక్టోబర్ 2020 రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ (Royal College of Psychiatrists)

This translation was produced by CLEAR Global (Nov 2024)
Read more to receive further information regarding a career in psychiatry