జ్ఞాపక సమస్యలు మరియు చిత్తవైకల్యం

Memory problems and dementia

Below is a Telugu translation of our information resource on memory problems and dementia. You can also view our other Telugu translations.

హక్కు నిరాకరణ

దీన్ని చదవడానికి ముందు, దయచేసి మా నిరాకరణను సమీక్షించండి.

మనలో చాలా మంది వయసు పెరిగే కొద్దీ మతిమరుపుకు గురవుతారు.

ఇది చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని ఆందోళన చెందడం సులభం.

కానీ దీనికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. మనలో కొంతమందికి మాత్రమే చిత్త వైకల్యం యొక్క గంభీరమైన సమస్యలు అభివృద్ధి చెందుతాయి ఈ వెబ్‌పేజీ చిత్తవైకల్యంతో సహా పేలవమైన జ్ఞాపకశక్తికి కొన్ని కారణాలను మరియు మీరు మీ స్వంత జ్ఞాపకశక్తి గురించి లేదా మరొకరి గురించి ఆందోళన చెందుతుంటే సహాయం ఎలా కనుగొనాలో చూస్తుంది.

అనేక విషయాలు మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. అలాంటి వాటి మాదిరిలో – ఒత్తిడి,ఆవేదన , నష్టం అనుభవించడం వంటివి - మరియు విటమిన్ లోపాలు లేదా సంక్రమణ వ్యాధులు వంటి శారీరగాలురోగాలు ఉన్నాయి.1

ఈ దిగువన, మేము రెండు నిర్దిష్ట జ్ఞాపక సమస్యలపై దృష్టి పెడతాము: అల్జీమర్స్ వ్యాధి మరియు తేలికపాటి మేధోపార్శ్విక లోపం (MCI) తో సహా వివిధ రూపాల్లో వచ్చే చిత్తవైకల్యం.

చిత్తవైకల్యం అంటే ఏమిటి?

చిత్తవైకల్యం అనేది జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే పరిస్థితుల సమూహాన్ని వివరించడానికి ఉపయోగించే సాధారణ పదం.

  • విషయాలను గుర్తుంచుకోవడం మరియు మీ ఆలోచనతో ఇతర సమస్యలను అభివృద్ధి చేయడం మీకు కష్టమవుతుంది. ఇవి మీ రోజువారీ జీవితాన్ని ఎదుర్కోవడం మరింత కష్టతరం చేస్తాయి.
  • ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి - లేదా 'ప్రగతిశీలమైనవి'. అవి వృద్ధాప్యంలో సాధారణ భాగం కాదు.2

చిత్తవైకల్యంలో అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకశక్తి కోల్పోవడాన్ని కలిగి ఉంటాయి, కానీ వాటికి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి, అవి కారణాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి. చిత్తవైకల్యం తరచుగా జ్ఞాపక సమస్యలతో ప్రారంభమవుతుంది, కానీ చిత్తవైకల్యం ఉన్న వ్యక్తికి కూడా ఇది కష్టంగా ఉంటుంది :

  • రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం మరియు నిర్వహించడం
  • ఇతరులతో సంభాషించటం

వారు వారి మానసిక స్థితి మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో కూడా మార్పులు ఉండవచ్చు లేదా మీరు వారి వ్యక్తిత్వంలో మార్పులను చూడవచ్చు.

చిత్తవైకల్యం అనేది 'ప్రగతిశీలమైనది' కాబట్టి, చిత్తవైకల్యం ఉన్న ఎవరైనా సమయం గడిచేకొద్దీ వారికి సహాయపడటానికి ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు.

చిత్తవైకల్యం ఎంత సాధారణం?

ఇది ప్రస్తుతం UKలో 850,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది3. మనం పెద్దయ్యాక ఇది మరింత సాధారణం అవుతుంది, కాబట్టి:

  • 65 సంవత్సరాల వయస్సులో, ప్రతి 100 మందిలో సుమారు 2 మందికి చిత్తవైకల్యం ఉంటుంది.
  • 85 సంవత్సరాల వయస్సులో, ప్రతి 5 మందిలో 1 వ్యక్తికి కొంతవరకు చిత్తవైకల్యం ఉంటుంది.4 

చిత్తవైకల్యం కొన్నిసార్లు యువకులను ప్రభావితం చేస్తుంది మరియు ఈ వ్యాధి కుటుంబాల్లో కూడా ఉంటుంది , అయినప్పటికీ ఇది చాలా తక్కువగా ఉంటుంది.

తేలికపాటి మేధోపార్శ్విక లోపం అంటే ఏమిటి?

తేలికపాటి మేధోపార్శ్విక లోపం (MCI) అనేది ఒక తక్కువ తీవ్రత గల జ్ఞాపక సమస్య. ఇది మీ రోజువారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు, మరియు ఇది చిత్తవైకల్యం అని పిలువబడేంత తీవ్రమైనది కాదు. ఇతర వ్యక్తులు మీలో క్రింది విషయాలను గమనించవచ్చు:

  • వ్యక్తుల పేర్లను , ప్రదేశాలను , గుప్త పదాలను మర్చిపోవడం
  • వస్తువులను ఉండవలసిన చోట పెట్టకపోవడం
  • మీరు చేయడానికి ప్రణాళిక చేసుకున్న వాటిని మర్చిపోవటం .

ప్రతి 10 మందిలో ఒకరికి, 65 ఏళ్లు పైబడిన వారికి బహుశా MCI ఉండవచ్చు. వీరిలో ప్రతి పది మందిలో ఒకరికి ఏ ఒక్క సంవత్సరంలోనైనా చిత్తవైకల్యం వస్తుంది.5 ఎవరు చిత్తవైకల్యానికి గురవుతారో, ఎవరు గురికారో మనం ఇంకా అంచనా వేయలేము. 

ఏ రకమైన చిత్తవైకల్యం ఉన్నాయి?

ఈ దిగువ మేము అత్యంత సాధారణ చిత్తవైకల్య రుగ్మత లని వివరిస్తాము. కానీ ఒక వ్యక్తికి కొన్నిసార్లు ఈ రుగ్మతలలో ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు - 'మిశ్రమ చిత్తవైకల్యం'. 

అల్జీమర్స్ వ్యాధి

82 ఏళ్ల రిటైర్డ్ సెక్రటరీ అయిన ఎలీన్ తన బలహీనమైన, 90 ఏళ్ల భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమె శారీరకంగా బాగానే ఉంది మరియు ఎటువంటి ఔషధం తీసుకోదు. 
గత రెండేళ్లుగా ఎలీన్ తాళాలు పోగొట్టుకుంటున్నట్లు, భర్తకు సకాలంలో ఔషధం ఇవ్వడం మర్చిపోతున్నట్లు ఆమె కూతుళ్లు గుర్తించారు. ఎలీన్ ఎల్లప్పుడూ అద్భుతమైన డ్రైవర్ అయినప్పటికీ, ఆమె కారుకు ఇప్పుడు ఒక బంపర్ మరియు పక్కన కొన్ని గీతలు ఉన్నాయి, వాటిని ఎలీన్ వివరించలేకపోయింది. ఆమె కొత్త రిమోట్‌తో టీవీని కూడా ఆన్ చేయలేకపోతుంది .  మొదట వారు ఈ సమస్యలకు ఆమె వయస్సు మరియు ఆమెను జాగ్రత్త తీసుకుంటున్న ఒత్తిడికి కారణమని చెప్పారు.
తన జ్ఞాపకశక్తితో అసలు సమస్య ఉందని ఎలీన్ భావించడం లేదు. తన జ్ఞాపకశక్తి గురించి ఆందోళన చెందుతున్నామని తన కుమార్తెలు చెప్పినప్పుడు ఆమె చిరాకు మరియు కలత చెందుతుంది. చాలా నచ్చజెప్పిన తరువాత, ఆమె వారితో సాధారణ వైద్యుడు దగ్గరికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. సాధారణ వైద్యుడు కొన్ని సాధారణ జ్ఞాపకశక్తి పరీక్షలను చేసి ఆ తరువాత ఎలీన్‌ను స్పెషలిస్ట్ మెమరీ సర్వీస్‌కు సూచిస్తుంది.  

చిత్తవైకల్యం గల వారిలో 10 మందిలో 6 గురుకి‌ అల్జీమర్స్ రావచ్చు.6 ఇది సాధారణంగా జ్ఞాపక సమస్యలతో ప్రారంభమవుతుంది మరియు కాలక్రమేణా నెమ్మదిగా అధ్వాన్నంగా మారుతుంది. సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో వారు ఇప్పటికీ గుర్తుంచుకోగలిగినప్పటికీ, ఇటీవల జరిగిన విషయాలను వారు గుర్తుంచుకోలేరని ప్రజలు తరచుగా గమనిస్తారు.

నిర్దిష్ట పదాలను గుర్తుంచుకోవడం మరియు వస్తువులకు పేర్లు పెట్టడంలో వారికి ఇబ్బంది ఉందని వారు తరచుగా కనుగొంటారు. కొన్నిసార్లు వారి జ్ఞాపక సమస్యల గురించి వారికి తెలియదు, కాని ఇతరులు వారిని గమనిస్తారు. చిత్తవైకల్యం ఉన్న వ్యక్తికి కూడా ఇది గ్రహించుట కష్టంగా ఉంటుంది :

  • కొత్త విషయాలు నేర్చుకోవడంలో
  • ఇటీవలి సంఘటనలు, సమయ నియామకాలు లేదా ఫోన్ సందేశాలను గుర్తుంచుకోవడంలో
  • వ్యక్తులు లేదా ప్రదేశాల పేర్లను గుర్తుంచుకోవడంలో
  • ఇతర వ్యక్తులను అర్థం చేసుకోవడంలో, లేదా వారితో సంభాషణలు చేయడంలో
  • వారికి వారి వస్తువులను ఎక్కడ ఉంచారో గుర్తుంచుకోవడం అనేది చాలా కలవరపెడుతుంది – ఎవరైనా వారి ఇంట్లో ఉన్నట్లు లేదా వారి వస్తువులను ఎవరో తీసుకున్నట్లు అనిపిస్తుంది
  • వారిలో ఏదైనా మార్పు ఉందని అర్థం చేసుకున్న తరువాత - ఎవరైనా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు కోపంతో అడ్డుకుంటారు.

ఈ ఇబ్బందులన్నీ సాధారణ రోజువారీ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో కష్టతరం చేస్తాయి. 

అల్జీమర్స్ ఉన్నవారి గురించి తెలిసిన వ్యక్తులు తరచుగా వారి వ్యక్తిత్వంలో సూక్ష్మమైన మార్పులను గమనిస్తారు.  వారు జబ్బుపడిన ముందు కంటే భిన్నంగా ప్రవర్తిస్తారు లేదా ప్రతిస్పందిస్తారు. 

అల్జీమర్స్‌తో అమిలాయిడ్, టౌ అనే ప్రొటీన్లు మెదడులో అభివృద్ధి చెంది 'ఫలకాలు', 'చిక్కులు' అనే నిక్షేపాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో మెదడుకు డ్యామేజి జరుగుతుంది మరియు ఇది ఒక కణం నుండి మరొక కణానికి సందేశాలను ప్రసారం చేసే మెదడులోని రసాయనాలను ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా దీనిని ఎసిటైల్కోలిన్ అని అంటారు.7

రక్తనాళం యొక్క మధిక మతిమరుపు

జాన్ ఒక 78 ఏళ్ల ఉద్యోగ విరమణ పొందిన ఇంజనీర్. ఆయనకు అధిక రక్త పోటు ,మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నాయి. 18 నెలల క్రితం రెండుసార్లు గుండెపోటు వచ్చిన తర్వాత రక్త నాళం యొక్క విస్తరణ (నిరోధిత ధమనులను తెరిచే ప్రక్రియ) చేయించుకున్నప్పటికీ తరచుగా ఛాతీలో నొప్పి వస్తు ఉంటుంది .
మొదటి గుండెపోటు తర్వాత, అతని జ్ఞాపకశక్తి కొంతకాలం క్షీణించింది, తరువాత మళ్ళీ మెరుగుపడినట్లుగా అనిపించింది. కానీ రెండోమారు నుంచి అతను మతిమరుపుతో ఉన్నాడని, మునుపటిలా ఏకాగ్రత సాధించలేకపోతున్నాడని అతని భార్య, కుమారుడు గమనించారు. అతని మనోభావాలు మరింత హెచ్చుతగ్గులు గా మారిపోయాయి - అతను సులభంగా చిరాకు మరియు కోపం తెచ్చుకొనుట ,అలాగే ఇతర సమయాల్లో కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకొనుట జరిగేవి .  అతనికి చుట్టుపక్కల తిరగడం కష్టంగా మారింది మరియు ఒకటి లేదా రెండుసార్లు అతను తనకు తెలియకుండా మూత్రం పోసుకున్నాడు, ఇది అతనికి చాలా అసౌకర్యం గా అనిపించింది. అతని GPసాధారణ వైద్యుడు )  అతనికి చేసిన పరీక్షలలోజ్ఞాపకశక్తి యొక్క సమస్యలను కనుగొన్న తరువాత, MRI బ్రెయిన్ స్కాన్ లో అనేక చిన్న మస్తిష్క సంకేతాలు చూపించింది. 

రక్త నాళాలు దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. దీని అర్థం మెదడులోని భాగాలకు ఎప్పుడు అయితే తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు లభించవో అప్పుడు మెదడు కణాలు చనిపోతాయి.

రక్తనాళాల మస్తిష్కాభివృద్ధి సంబంధిత మానసిక అస్వస్థత రకాలు వీటిని కలిగి ఉంటుంది:

  • మస్తిష్కప్రహరం-సంబంధిత – మెదడుకు రక్తనాళం అకస్మాత్తుగా నిరోధించబడుతుందో, ఉదాహరణకు రక్తం గడ్డకట్టడం ద్వారా
  • సబ్కార్టికల్ మానసిక అస్వస్థత– మెదడు యొక్క దిగువ భాగాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన చిత్తవైకల్యం, ఇక్కడ చాలా చిన్న రక్త నాళాలలో రక్త ప్రవాహం తగ్గుతుంది.

ఒకవేళ మీకు ధమనులు మూసుకుపోవడానికి దారితీసే పరిస్థితులలో ఒకటి ఉంటే మీకు రక్తనాళాల మానసిక అస్వస్థత వచ్చే అవకాశం ఉంది. వీటిలో అధిక రక్త పోటు , మధుమేహం , అధిక కొలెస్ట్రాల్ - మరియు అలాగే ధూమపానం ఉన్నాయి..8

రక్తనాళా ల మానసిక అస్వస్థత అనేది ఎలా అభివృద్ధి చెందుతుందో అంచనా వేయడం కష్టం, ఎందుకంటే సమస్యలు మెదడులోని ఏ భాగం ప్రభావితమవుతాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. బహుశా ఇవి ఉండవచ్చు:

  • జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు దృష్టి పెట్టడంలో ఇబ్బంది
  • భాషా సంబంధిత ఇబ్బందులు - అల్జీమర్స్‌లో వంటివి
  • భావోద్వేగ మార్పులు లేదా ఆవేదన
  • నడకలో ఇబ్బంది లేదా మూత్రధార నియంత్రణ కోల్పోవడం వంటి శారీరక సమస్యలు.

లెవీ బాడీస్‌తో మతిమరుపు / పార్కిన్సన్ వ్యాధి మతిమరుపు  

టెర్రీ అనే 66 ఏళ్ల ఉద్యోగ విరమణ పొందిన ఉపాద్యాయుడు, ఒంటరిగా నివసిస్తున్నారు.  ఆయన ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేసినప్పటి నుండి నిరుత్సాహంగా అనిపిస్తోంది, మరియు ఆయన ఆలోచనా శక్తి నిజంగా నెమ్మదించింది. 
ఆయన గత కొన్ని నెలలుగా తన కుడి చేయి వణకడాన్ని గమనించారు మరియు ఆయన నిన్న వీధిలో పడిపోయారు. అతనికి, తాను తడబడుతూ నడవడం విచారం కలిగించింది. ఎందుకంటే అతను తనను తాను ఎప్పుడు కూడా చురుగ్గా మరియు క్రీడా నైపుణ్యం ఉన్న వ్యక్తి గా చూసుకున్నందువలన. వాహనం నడిపే సమయం లో ఏకాగ్రత కోల్పోయి దాదాపు ప్రమాదానికి గురికావడంతో, ఆయన కుమార్తె క్యాత్ ఆందోళన చెందింది. పొద్దున్నే తన మంచం ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉండటం, కొన్నిసార్లు గాయాలు ఉండటం వల్ల అతను దీన్ని సరిపోని నిద్రకు పరిమితం చేశారు.
గత కొన్ని వారాలుగా, ఆయన తన సాయంత్రం వేళలో తన గది లో ఒక మూలన నిశ్శబ్దంగా ఆడుకుంటున్న పిల్లవాడిని చూడటం ప్రారంభించారు. అతను ఒక రాత్రి అతనికి తినడానికి ఏదో ఇచ్చాడు, కాని తన కుమార్తె ఆ పిల్లవాడిని చూడలేదని గ్రహించాడు.  తేదీలను గుర్తుంచుకోవడం మరియు ఇంటి చుట్టూ తన పనులను ప్రణాళిక వేయడం లో అతను మరింత దిగజారిపోతున్నారని క్యాథ్ భావిస్తున్నారు.
ఆందోళన చెందిన తన GP (సాధారణ వైద్యుడు ) అతనిని జ్ఞాపక శక్తి చికిత్స కేంద్రం కి సూచిస్తున్నారు .  మెదడు పరిశీలించిన తర్వాత, వారు లెవీ బాడీస్‌తో కూడిన జ్ఞాపక శక్తి తగ్గిపోవుట నిర్ధారిస్తారు.

మెదడులో ప్రోటీన్ నిక్షేపాలు (లెవీ బాడీస్) ఏర్పడటం వల్ల ఇది సంభవిస్తుంది.9 పార్కిన్సన్ వ్యాధి యొక్క లక్షణాలు అభివృద్ధి చెందుతాయి, అయితే తరచుగా ఇవి అనారోగ్యంలో తరువాత కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలలో ఇవి ఉంటాయి:

  • జ్ఞాపక సమస్యలు మరియు పనులను ప్రణాళిక చేయడంలో ఇబ్బంది
  • రోజంతా కూడా మారుతూ ఉండే గందరగోళం
  • వ్యక్తులు లేదా జంతువుల యొక్క స్పష్టమైన దృశ్య సంబంధిత భ్రాంతులు
  • నిద్ర సమస్యలు, కలలు కంటున్నప్పుడు ఎక్కువగా చలించడం
  • చేతులు వణకడం, కండరాల బిగుతు, పడిపోవడం లేదా నడవడంలో ఇబ్బంది వంటి పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు.

ఫ్రంటో-టెంపోరల్ డిమెన్షియా

ఈ రకమైన డిమెన్షియా ప్రధానంగా యువకులలో సంభవిస్తుంది. ఇది ఇతర భాగాల కంటే మెదడు ముందు భాగాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.  ఇది తరచుగా 50 మరియు 60 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో ప్రారంభమవుతుంది.11 

ఇది ఎక్కువ గా వ్యక్తిత్వ మరియు ప్రవర్తన లో మార్పులు మరియు ప్రసంగంతో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి ఎక్కువ కాలం ప్రభావితం కాకుండా ఉంటుంది. 3 ప్రధాన రకాలు ఉన్నాయి:

  • ప్రవర్తనా సంబంధిత – సాధారణంగా చాలా మర్యాసదగా మరియు సరిగ్గా ఉండే వ్యక్తి చిరాకు లేదా మొరటుగా మారడం ప్రారంభించవచ్చు లేదా వారి రూపాన్ని చూసుకోవడంలో ఆసక్తి కోల్పోవచ్చు
  • భాషా శాస్త్ర సంబందిత - ఇందులో ప్రధాన సంకేతం వాస్తవాలను గుర్తు చేసుకోవడంలో, భాష ని అర్థం చేసుకోవడంలో సమస్యలు
  • ప్రగతిశీల గణనీయం లేని భాషా శోధన  - మాట్లాడటం మరియు పదాలను చెప్పడం లో ఇబ్బంది.

లింబిక్-ప్రధాన వయస్సు-సంబంధిత TDP-43 ఎన్సెఫలోపతి (LATE)

కొన్ని కొత్త మతిస్కలతను ఇటీవల మరణానంతర మెదడు కణాల నమూనాలను పరిశీలించి గుర్తించారు ఇది వృద్ధులలో సాధారణం మరియు ఇది పైన పేర్కొన్న ఇతర రుగ్మతలతో పాటు కనిపిస్తుంది. LATEను నిర్ధారించాడాచూడడానికి పరిక్షించాలా ఇంకా తెలియదు.10

అరుదైన కారణాలు

మతిస్కలతకు అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కారణాలు ఇవి ఉంటాయి:

  • మస్తిష్కం యొక్క బాహ్య పొర (కోర్టెక్స్) మరియు బేసల్ గ్యాంగ్లియా (మనోభావాలు మరియు చలనాలు నియంత్రించే మెదడు భాగం) లో క్షయం కలిగే రుగ్మత
  • మస్తిష్క కణాల నాశనం కలిగించే వ్యాధి
  • హెచ్ఐవి -సంబంధిత అభిజ్ఞా బలహీనత
  • హంటింగ్టన్ వ్యాధి
  • బహుళ కణజాల సంతత వ్యాధి
  • మద్యం వల్ల కలిగే జ్ఞాపకశక్తి సమస్య
  • సాధారణ ఒత్తిడి మస్తిష్క జలకణ్ధము
  • పృష్ఠభాగ కార్టికల్ క్షీణత
  • ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ.

మతిశ్కలనం ఎలా నిర్ధారణ అవుతుంది?

వైద్యుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే లక్షణాల యొక్క నమూనాను గుర్తించి, ఆ లక్షణాలు ఆ వ్యక్తి రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుని మతిశ్కలనాన్ని నిర్ధారిస్తారు.

కాబట్టి, వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మొదటి దశ సాక్షాత్కారం నిర్వహించడం. వారి ఆలోచన మరియు జ్ఞాపకశక్తిని పరీక్ష చేయడానికి ప్రశ్నావళి ఉపయోగించబడుతుంది - దీనిని 'మేధా పరీక్ష ' అంటారు. ఒక శారీరక పరీక్ష చేయబడుతుంది మరియు అలాగే చేయి తట్టి వేయడం వంటి సాధారణ శారీరక పనులను కలిగి ఉన్న కొన్ని పరీక్షలు ఉంటాయి. ఏమి జరుగుతోందో వారి గురించిన వివరణ ఇవ్వగల బంధువుతో మాట్లాడగలగడం వలన పరిశీలనల చేయు వారికి సహాయపడుతుంది.

ఈ మొదటి సమావేశం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు మతిమరుపు యొక్క రకం గురించి ఆధారాలు ఇస్తుంది. ఈ లక్షణాలకు ఇతర కారణాలను చూడటానికి రక్త పరీక్షలు మరియు స్కాన్‌లను ఉపయోగించవచ్చు. స్కాన్లు (CT/MRI మెదడు పరిశీలనలు) మతిమరుపు రకాన్ని గుర్తించడంలో సహాయపడతాయి మరియు ఇది ఏదైనా చికిత్సకు మార్గనిర్దేశం చేస్తుంది.12

ప్రారంభ నిర్ధారణ కోసం సహాయం చేయడానికి 'స్మృతి చికిత్స కేంద్రం (మెమరీ క్లినిక్) అనే ప్రత్యేక వైద్య నిపుణులకు పరిచయం చేయడం ఇప్పుడు సాధారణమైన ప్రక్రియగా మారింది.  మతిమరుపు ఉన్న వ్యక్తి తరచుగా నిపుణుల శ్రేణిని చూస్తారు - మానసిక వైద్యుడు, వృద్ధాప్య నిపుణులు, మనస్తత్వవేత్తలు, వృత్తి చికిత్సకుడు మరియు నర్సులు.

మతిమరుపు నుండి ఎవరికి ప్రమాదం ఉంది?

మనలో ఎవరిలో ఐనా మతిమరుపు అభివృద్ధి కావచ్చు , కానీ ఇది వృద్ధాప్యం యొక్క సహజ లేదా అనివార్య పరిణామం కాదు. కొన్ని వైద్య పరిస్థితులు దీనికి ఎక్కువ అవకాశం కలిగిస్తాయి13.

వీటిలో కొన్ని కారణాలు ఇవి ఉంటాయి:

  • పార్కిన్సన్ వ్యాధి
  • మస్తిష్కహత మరియు గుండె జబ్బు
  • అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
  • రకం 2 మధుమేహం .

ఈ ప్రమాద కారకాలకు, ముఖ్యంగా అధిక రక్తపోటు మరియు మధుమేహం ‌కు చికిత్స చేయడానికి మరియు నిర్వహించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. వినికిడి లోపం, ఊబకాయం, సామాజిక ఒంటరితనం మరియు ఆవేదనతో ఏవైనా సమస్యలను నిర్వహించడానికి నడి వయస్కులలో ఇది సహాయపడుతుంది.14

వివిధ రకాల మానసిక అవస్థ 15 ప్రమాదాన్ని పెంచే జీవనశైలి కారకాలు:

  • ధూమపానం
  • ఆల్కహాల్ యొక్క సురక్షిత పరిమితి కంటే ఎక్కువ తాగడం - వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ
  • ఆహార లోపం
  • శారీరక శ్రమ లేకపోవడం
  • అధిక బరువు కలిగి ఉండటం
  • పదేపదే తలకు గాయాలు తగలడం, ఉదా: బాక్సర్లలో.

ధూమపానం మానయడం మద్యం తీసుకోవడాన్ని తగ్గించడం, వ్యాయామం పెంచడం మరియు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం (ఉదా. మధ్యధరా ప్రాంతపు లాంటి ఆహారం ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది) మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది, ప్రత్యేకించి ఈ మార్పులు మీ 40 మరియు 50 వయసులలో చేయబడితే గనుక .16

మతిమరుపు లో జన్యువులు కూడా పాత్ర పోషిస్తాయి. 65 సంవత్సరాల వయస్సు తర్వాత అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా జన్యుపరమైన రుగ్మత వల్ల సంభవించదు, కానీ ప్రమాదాన్ని చిన్న మొత్తంలో పెంచే లేదా తగ్గించే అనేక జన్యువులు కనుగొనబడ్డాయి.17 ఒక బంధువుకుమతిమరుపు ఉంటే, మీరు మతిమరుపు ను కలిగి ఉంటారని దీని అర్థం కాదు మరియు మీ వ్యక్తిగత ప్రమాదాన్ని అంచనా వేయగల పరీక్ష (ఇంకా) లేదు.

కొన్ని కుటుంబాలలో, 'ప్రారంభ మతిమరుపు ' సర్వసాధారణం, కాబట్టి ఇక్కడ బలమైన జన్యుపరమైన కారణం ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే, డౌన్ లక్షణాల సమూహం ఉన్నవారు త్వరగా మతిమరుపు ను కలిగి ఉండే అవకాశం ఉంది.17 మీ కుటుంబంలో 65 సంవత్సరాల కంటే ముందు మతిమరుపు తో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే, చికిత్స సంబంధిత జన్యుశాస్త్రవేత్త నుండి సలహా పొందడం విలువైనది.

మతిమరుపు కి ఏదైనా చికిత్సలు ఉన్నాయా?

ఇది రోగ నిర్ధారణ మరియు మీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.  ఈ పరిస్థితులకు ఇంకా చికిత్సలు లేవు. మీకు లేదా మీ బంధువుకు స్వతంత్రంగా మరియు సాధ్యమైనంత కాలం చలనశీలంగా ఉండటానికి సహాయం చేసే కొన్ని ఎంపికలు ఉన్నాయి.. 

  • ఎసిటైల్కోలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ (డోనెపెజిల్, గాలాంటమైన్ మరియు రివాస్టిగ్మైన్) అని పిలువబడే మందుల సమూహం మరియు మెమాంటిన్ అని పిలువబడే మరొక మందు అలమర్స్ మతిమరుపు యొక్క కొన్ని లక్షణాలకు చికిత్స చేయగలవు మరియు ప్రజలు వారి స్వతంత్రతను ఎక్కువ కాలం కొనసాగించడంలో సహాయపడతాయి.18 ఈ మందులు లెవీ బాడీ మతిమరుపు లక్షణాలకు కూడా సహాయపడతాయి, ప్రత్యేకించి భ్రాంతులు ఒక సమస్య అయితే.19 అల్జీమర్స్ వ్యాధికి మందుల చికిత్సలపై మా సమాచారాన్ని చూడండి.
  • రక్త నాళం సంబందిత మతిమరుపు లో మీకు అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ ,మధుమేహం ఉంటే ఔషధం తీసుకోవాలని మీ GP (సాధారణ వైద్యుడు వైద్యుడు )సూచించవచ్చు. ధూమపానం మానేయడం, ఆరోగ్యంగా తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంలో కూడా సహాయపడుతుంది.
  • సాధారణంగా మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించడానికి విటమిన్లు B మరియు E, కొవ్వు ఆమ్లంల (చేప నూనెలతో సహా) మరియు సంక్లిష్ట ఆహార పదార్ధాలు సిఫారసు చేయబడవు20,కానీ మీ సాధారణ వైద్యుడు విటమిన్ లోపాలు ఉంటే చికిత్స చేయమని సూచించవచ్చు. కొన్ని అనుబంధ ఔషధాలు నియమిత ఔషధాలతో పరస్పర చర్యకు దారితీయవచ్చు, కాబట్టి మీరు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ సమీక్షించడం వైద్యుడు ‌తో సమీక్షించడం మంచిది.
  • సమూహ మేధోావళి ఉత్తేజనం అని పిలువబడే మానసిక చికిత్స జ్ఞాపకశక్తికి సహాయపడుతుంది మరియు ఆలోచనా నైపుణ్యాలను ప్రేరేపించడానికి సమూహ ఆటలను ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.21
  • జ్ఞాపకశక్తి చికిత్సలో మరొక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో గత కార్యకలాపాలు, సంఘటనలు మరియు అనుభవాల చర్చ ఉంటుంది. ఇది అవగాహన మరియు జ్ఞానం (పరిజ్ఞానం) రెండింటికీ అలాగే రక్షకులపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.22 
  • చిత్తవైకల్యం పురోగమించే వేగం చాలా పరివర్తన శీలం గా ఉంటుంది. చిత్తవైకల్యం నిర్ధారణ తరువాత ప్రజలు చాలా సంవత్సరాలు చురుకైన, ఉత్పాదక మరియు అర్థవంతమైన జీవితాలను గడపవచ్చు. 

నాకు చిత్తవైకల్యం ఉంది - నేను ఇతరులకు ఎలా సహాయపడగలను?

చిత్తవైకల్యం యొక్క కారణాలు మరియు దానికి ఎలా చికిత్స చేయాలనే దానిపై UKలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. UKలో ప్రస్తుతం మూడు ప్రధాన పరిశోధన జాలా‌లు పనిచేస్తున్నాయి23:

  • ఇంగ్లాండ్ - మతిమరుపు మరియు నాడీ సంబంధిత నాశన వ్యాధుల పరిశోధన జాలం (DeNDRoN
  • స్కాట్లాండ్ - స్కాటిష్ మతిమరుపు చికిత్స పరిశోధన జాలం (SDCRN) - ఈ జాల స్థలం ‌ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
  • వేల్స్ - వేల్స్ చిత్తవైకల్యం మరియు నాడీ సంబంధిత నాశనవ్యాధులు పరిశోధన జాలం (NEURODEM Cymru)

మతిమరుపు పరిశోధనలో చేరండి అనేది UKలో రోగి లేదా సంరక్షకునిగా మీ ఆసక్తిని నమోదు చేయడానికి ప్రధాన మార్గం. మీరు మరొకరి సమ్మతితో కూడా నమోదు చేయవచ్చు.

ఆసక్తిగల స్వచ్ఛంద సేవకుల పేర్లను పరిశోధకులతో జత చేయటానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ (NIHR) అల్జీమర్స్ స్కాట్లాండ్, అల్జీమర్స్ రీసెర్చ్ UK మరియు అల్జీమర్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ సేవ ను అభివృద్ధి చేశారు.

స్థానికంగా ఏ పరిశోధన జరుగుతోందో మీరు మీ సాధారణ వైద్యుడు (GP )లేదా స్థానిక మానసిక ఆరోగ్య బృందాన్ని కూడా అడగవచ్చు.

నాకు నేను ఎలా సహాయపడగలను?

సాధారణ ఆచరణాత్మక దశలు

  • సమయం నిర్ణయాలు గుర్తుంచుకోవడంలో మీకు సహాయపడటానికి దినచర్య పుస్తకం ని ఉపయోగించండి.
  • మీరు చేయవలసిన పనుల జాబితాలను తయారు చేయండి - మరియు మీరు వాటిని చేస్తున్నప్పుడు వాటిని గీత వేసి పూర్తి చేయండి!
  • పజిల్స్ చదవడం లేదా చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు మీ జీవితంలో ఉద్దేశ్య భావనను కొనసాగించడం ద్వారా మీ మనస్సును చురుకుగా ఉంచండి.
  • మీరు ఆసక్తి ఉన్న ప్రదేశాలు మరియు ఇతర సామాజిక కార్యకలాపాలను కనుగొనండి, వాటిలో పాల్గొని సంబంధాన్ని ఉంచుకోండి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు శారీరక వ్యాయామం చేయండి (ఇది మీ వయస్సుతో సంబంధం లేకుండా సహాయపడుతుంది).
  • మీరు రోజువారీ జీవితంతో పోరాడుతుంటే లేదా మీరు నిర్వహించడం కష్టమని ఇతరులు భావిస్తే మద్దతు పొందండి. కుటుంబం, స్నేహితులు మరియు సేవ ‌లు సాధ్యమైనంత ఎక్కువ కాలం స్వతంత్రంగా జీవించడానికి మీకు సహాయపడే అనేక మార్గాలు ఉన్నాయి.

ప్రణాళిక చేయడం

మీ డబ్బును నిర్వహించడం లేదా వైద్య నిర్ణయాలు తీసుకోవడం వంటి మీ జీవితంలోని ముఖ్యమైన భాగాల గురించి నిర్ణయాలు తీసుకోవడం మీకు కష్టంగా అనిపించే సమయం రావచ్చు. చిత్తవైకల్యంతో మీ ఆలోచన ప్రభావితం కావడానికి ముందు మీరు నిర్ణయం తీసుకోగలిగితే మీరు ఇష్టపడే దాని ఆధారంగా మీ తరఫున అటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కును మీరు విశ్వసనీయ బంధువు, స్నేహితుడు లేదా న్యాయవాదికి ఇవ్వవచ్చు.

దీనిని శాశ్వత ప్రాథికారంలాస్టింగ్ పవర్ ఆఫ్ అటార్నీ (LPA) అంటారు.24 న్యాయవాది LPAను ఏర్పాటు చేయడానికి మీకు సహాయపడగలరు. LPAలో 2 రకాలు ఉన్నాయి - ఒకటి 'సంపత్తి మరియు ఆర్ధిక వ్యవహారాల ‘ నిర్వహణకుమరొకటి 'ఆరోగ్యం మరియు సంక్షేమం'కు సంబంధించిన విషయాలకు.

  • సంపత్తి మరియు ఆర్థిక వ్యవహారాలు LPA - న్యాయవాదులు బ్యాంకింగ్, పెట్టుబడులు, ఆస్తి అమ్మకాలు, పన్నులు మరియు లాభాలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోడానికి నియమించబడవచ్చు.
  • ఆరోగ్యం మరియు సంక్షేమ LPAలు - వైద్య చికిత్స, రోజువారీ సంరక్షణ మరియు నివాస స్థలం వంటి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయవాదులను నియమించవచ్చు.

అన్ని LPAలు ఉపయోగించడానికి ముందు ప్రజా రక్షక కార్యాలయంలో నమోదు అయి ఉండాలి.

వీటికి సంబంధించి గమనిక: శాశ్వత ప్రాధికారం (EPA): ఇప్పుడు LPA EPAని బదిలీ చేసింది. ఏదేమైనా, 1 అక్టోబర్ 2007 కంటే ముందు అమలు చేయబడిన చెల్లుబాటు అయ్యే EPA ఇంకా నమోదు కానప్పటికీ చెల్లుబాటు అవుతుంది.

ముందస్తు నిర్ణయాలు - మీరు అటువంటి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతే, భవిష్యత్తులో కొన్ని వైద్య చికిత్సలను తిరస్కరించాలనే మీ నిర్ణయాన్ని నమోదు చేయడం సాధ్యపడుతుంది. వీటిని మీ సంరక్షణను అందించే నిపుణులు గౌరవిస్తారు.25 ఇది ఒకే సమయంలో లేదా LPA నుండి వేరేగా చేయవచ్చు.

'ఇది నేను'

జ్ఞాపక సమస్యలు ఉన్నవారికి, నిపుణులు వారి గురించి ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా చూడగలగాలి. 

“ఇది నేను" అనే పత్రం ఈ లక్ష్యాన్ని సాధించడానికి పూర్తిచేయవచ్చు. ఇది ఒక వ్యక్తి యొక్క వైద్య చరిత్ర, వారి జీవితం మరియు ప్రాధాన్యతల గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగి ఉంది. దీనిని నియామకాలు లేదా ఆసుపత్రి ప్రవేశాలకు తీసుకెళ్లవచ్చు మరియు Alzheimers.org వెబ్‌సైట్ ద్వారా లభిస్తుంది. 

వాహనం నడపడం

చిత్తవైకల్యం నిర్ధారణ స్వయంగా వాహనం నడపడం ఆపడానికి ఒక కారణం కాదు, కానీ చిత్తవైకల్యం పెరిగేకొద్దీ,వాహనం నడపడం లాంటి నైపుణ్యాలు తగ్గుతాయి. ఇది మీ విజ్ఞాన కోణం అవగాహనలో మార్పులు, ఏకాగ్రత తగ్గడం లేదా ప్రభావిత తీర్పు మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాల వల్ల కావచ్చు. ఈ నైపుణ్యాలను కోల్పోవడం గురించి అవగాహన కొంతమంది వ్యక్తులకు లోపించవచ్చు.26

  • UK చట్టం ప్రకారం ఒక అధికార పత్రం పొందిన వ్యక్తి చిత్తవైకల్యంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయినట్లయితే, వారు రోగ నిర్ధారణ గురించి వెంటనే వారి సంబంధిత అనుమతి సంస్థ వారిని సంప్రదించాలి/తెలియ చేయాలి .Driver and Vehicle Licensing Agency (DVLA), లేదా ఉత్తర ఐర్లాండ్‌లోఅయితే వాహన దారు మరియు వాహన సంస్థ (DVA).27
  • చిత్తవైకల్యం ఉన్న వ్యక్తి యొక్క వాహన నడుపు సామర్థ్యాల గురించి ఒక వైద్యుడు ఆందోళన చెందుతుంటే - మరియు ఆ వ్యక్తి వాహన అనుమతి సంస్థ కి తెలియజేయకపోతే – వాహన అనుమతి సంస్థ కి తెలియజేయాల్సిన బాధ్యత వారికి ఉంది.28
  • మీ వాహనం నడుపు సామర్ధ్యంని ప్రభావితం చేసే చిత్తవైకల్యం గురించి వైద్యుడు ఆందోళన చెందితే, మీరు వాహనం నడుపుట వెంటనే ఆపేయాలని లేదా కనీసం Driver and Vehicle Licensing Agency DVLA/DVA పరిశోధన ఫలితాలు వచ్చే వరకు ఐనా ఆపాలని వారు చెప్పవచ్చు.
  • ఒక చాలకుడు వారి బీమా కంపెనీకి కూడా సమాచారాన్ని ఇవ్వాలి, తద్వారా వారి పాలసీ చెల్లుబాటు కావాలని నిర్ధారించుకోవచ్చు.
  • వాహన నడుపు పరిశీలనలో మీ వాహన నడుపు సామర్ధ్యం పై చిత్తవైకల్యం చూపే ప్రభావాన్ని స్పష్టం చేయడంలో సహాయపడుతుంది - మీరు వాహనం నడుపుట‌ను కొనసాగించవచ్చా అని నిర్ణయించేటప్పుడు ఈ సమాచారం అనుమతి సంస్థ కి సహాయపడుతుంది. ఈ పరిశీలన కోసం మీకు చెల్లుబాటు అయ్యే వాహన అనుమతి సంస్థ పట్టా అవసరం. వాహనదారు అనుమతి సంస్థ నిర్ణయం కోసం వేచి ఉన్న సమయంలో మీరు దీన్ని చేయవచ్చు.
  • చాలా మంది వ్యక్తులు తమను తాము వాహన నడుపుట నుంచి మానేసి, తమ అనుమతి పత్రం ని తి Driver and Vehicle Licensing Agency DVLA/DVAకి పంపాలని ఎంచుకుంటారు, దీనిని 'స్వచ్ఛంద అంగీకరించిన “ అని పిలుస్తారు.

ఆవేదన మరియు ఉత్ప్రేరక ఔషధం

మతిమరుపు ఉన్నవారిలో మనోవేదన మరియు ఆందోళన సర్వసాధారణం. అయినప్పటికీ,ఆవేదన అనేది మతిమరుపు లాగా కనిపించడం కూడా సాధ్యమే.29 చిత్తవైకల్యం వలె, ఇది తమను తాము చూసుకునే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. 

దీనిని 'నకిలీ మతిమరుపు ' అంటారు మరియు దానిని గుర్తించి చికిత్స చేయడం ముఖ్యం. మీరు లేదా బంధువు క్షోభ గురౌతున్నారు అని మీరు ఆందోళన చెందుతుంటే, మొదటి సందర్భంలో మీ సాథారణ వైద్యుల GP నుండి సలహా తీసుకోండి. ఆవేదన ను ఉత్ప్రేరక ఔషధం మరియు  మాట్లాడే చికిత్సతో చికిత్స చేయవచ్చు.30 

సహాయం మరియు మద్దతు పొందడం

ముగింపులో, మీరు మీ జ్ఞాపకశక్తి గురించి లేదా మరొకరి గురించి ఆందోళన చెందుతుంటే మీ సాధారణ వైద్యుడి (GP)ని కలవడానికి సమయ నియామకం తీసుకోండి. వారు శారీరక పరీక్ష, మీ జ్ఞాపకశక్తిని తనిఖీ చేయడానికి కొన్ని సాధారణ పరీక్షలు మరియు రక్త పరీక్షలను ఆదేశం చేయవచ్చు. అవసరమైతే, మీ వైద్యుడు మిమ్మల్ని విశేషజ్ఞుల జట్టు, మానసిక నిపుణుడు లేదా ప్రత్యేక వైద్యుడు కి సూచించవచ్చు.

చిత్తవైకల్యం యొక్క ఏ దశలోనైనా సమాచారం మరియు మద్దతును అందించగల ఇతర సంస్థల కోసం దిగువన కూడా చూడండి. మీకు ఆచరణాత్మక కార్యకలాపాలు మరియు రోజువారీ సంరక్షణ లేదా ప్రయోజనాలతో సహాయం కావాలంటే, మీరు సామాజిక సంరక్షణ మరియు సంరక్షణ సహాయ సేవల గురించి సలహా కోసం మీ స్థానిక అధికారాన్ని సంప్రదించవచ్చు.

ఇతర సమాచార వనరులు మరియు సహాయక సంస్థలు

NHS ఎంపికలు

స్థానిక సేవలకు లింక్‌లు మరియు చిత్తవైకల్యం గురించిన సమాచారం.

అల్జీమర్స్ సమాజం

సలహా మరియు మద్దతు కోసం జాతీయ స్థాయి సహాయక రేఖ: 0300 222 11 22.

ఇమెయిల్: helpline@alzheimers.org.uk

జాతీయ మతి స్వాసికత సహాయ రేఖ చిత్తవైకల్యంతో బాధపడుతున్న ఎవరికైనా వినడం, మార్గదర్శకత్వం మరియు తగిన సూచనల ద్వారా సమాచారం, సలహా మరియు మద్దతును అందిస్తుంది.

ఏజ్ UK

జీవితాన్ని మెరుగుపరిచే సేవలు మరియు కీలకమైన సహాయాన్ని అందించడం ద్వారా ప్రతి ఒక్కరికి తర్వాతి జీవితాన్ని మెరుగుపరచడానికి ఏజ్ UK సమూహం పనిచేస్తుంది. ఏజ్ UK ను కాల్ చేయండి: 0800 169 8787; ఇమెయిల్: contact@ageuk.org.uk

కేరర్స్ UK

సలహా లైన్: 0808 808 7777. కేరర్స్ UK స్నేహితులు లేదా బంధువుల కోసం చెల్లించని సంరక్షణను అందించే సంరక్షకులకు మద్దతు ఇస్తుంది.

పౌరుల సలహా కార్యాలయం

పౌరుల సలహ కార్యాలయం ఉచిత, గోప్యమైన మరియు స్వతంత్ర సలహాలను అందిస్తుంది.  ప్రయోజనాలు, ఆర్థిక ప్రణాళిక లేదా సేవా నిర్వహణ సహాయం కోసం మీ స్థానిక కార్యాలయాన్ని సంప్రదించండి.

ది లెవీ బాడీ సొసైటీ

లెవీ బాడీస్‌తో చిత్తవైకల్యంపై పరిశోధనకు నిధులు సమకూర్చే స్వచ్ఛంద సంస్థ, వ్యాధిని మరియు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవలసిన కుటుంబాలు మరియు సంరక్షకులకు సహాయం చేయడానికి మద్దతు మరియు సమాచారాన్ని అందిస్తుంది.

చట్ట సమాజం

చట్ట సమాజానికి ప్రాథియేటర్ల పత్రం లేదా ముందస్తు నిర్ణయాలు చేయడంలో చట్టపరమైన సమస్యల గురించి చాలా ఉపయోగకరమైన సమాచారం ఉంది మరియు సహాయం చేయడానికి న్యాయవాదిని కనుగొనడానికి ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది.

రక్షణ న్యాయస్థానానికి దరఖాస్తు చేయడం

మీకు తెలిసిన ఎవరి గురించి అయిన లేదా ఎవరి గురించి అయిన మీరు శ్రద్ద వహిస్తే వారు తమ వ్యక్తిగత ఆరోగ్యం, ఆర్థిక లేదా సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి , మీరు (లేదా వేరొకరు) వారి కోసం నిర్ణయాలు తీసుకునేలా రక్షణ న్యాయస్థానానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ప్రజా రక్షక కార్యాలయం

ఇంగ్లాండ్ మరియు వేల్స్ అంతటా విస్తరించే బాధ్యతలు కలిగిన ఒక సంస్థ (స్కాట్లాండ్ మరియు ఉత్తర ఐర్లాండ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి). ఇది ఎండ్యూరింగ్ పవర్స్ ఆఫ్ అటార్నీ (EPA) మరియు లాస్టింగ్ పవర్స్ ఆఫ్ అటార్నీ (LPA) నమోదులో మరియు కోర్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ద్వారా నియమించబడిన ప్రతినిధుల పర్యవేక్షణలో ప్రజా రక్షకులకు మద్దతు ఇస్తుంది.

ఇంకా చదవడానికి

పఠనీయ సంస్థ

చికిత్స సూచిక ప్రకారం పఠనీయ పుస్తక పథకం చిత్తవైకల్యం ఉన్నవారికి మరియు వారి సంరక్షకులకు మద్దతు ఇస్తుంది. వారు ఆరోగ్య నిపుణులు మరియు చిత్తవైకల్యం యొక్క ప్రత్యక్ష అనుభవం ఉన్న వ్యక్తులచే సిఫార్సు చేయబడ్డారు.

పుస్తకాలను ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేయవచ్చు లేదా వ్యక్తులు తమ స్థానిక పుస్తకాలయం నుండి ఉచితంగా శీర్షికలను స్వయంగా సూచించవచ్చు మరియు అరువు తీసుకోవచ్చు.

పుస్తక జాబితాలో ‌లోని శీర్షికలు నాలుగు వర్గాలుగా విభజించబడ్డాయి: సమాచారం మరియు సలహా; చిత్తవైకల్యంతో బాగా జీవించడం; బంధువులు మరియు సంరక్షకులకు మద్దతు; మరియు వ్యక్తిగత కథలు.

  • అల్జీమర్స్ మరియు ఇతర చిత్తవైకల్యాలు: మీ చేతివళ్లలో సమాధానాలు. కేటన్, గ్రాహం & వార్నర్. క్లాస్ పబ్లిషింగ్ (లండన్) లిమిటెడ్. 3వ సంచిక 2008.
  • మీ జ్ఞాపక శక్తి : వినియోగదారుల మార్గదర్శి.  బద్దెలీ. కార్ల్టన్ పుస్తకాలు (లండన్). సవరించిన సంచిక 2004.
  • చిత్తవైకల్యంతో నృత్యం: చిత్తవైకల్యంతో సానుకూలంగా జీవించడం నా కథ. బ్రైడెన్. జెస్సికా కింగ్స్లీ ప్రచురణాలయం (లండన్ మరియు ఫిలడెల్ఫియా). 2005.

సూచనలు

  1. Prince, M. et al. (2014). Nutrition and Dementia: a review of available research. Alzheimer’s Disease International. London. [online] Available at: https://www.alz.co.uk/nutrition-report [Accessed 4 Jul. 2019].
  2. Alzheimer’s Society. (2019). Normal ageing vs dementia. [online] Available at: https://www.alzheimers.org.uk/about-dementia/symptoms-and-diagnosis/how-dementia-progresses/normal-ageing-vs-dementia [Accessed 4 Jul. 2019].
  3. Prince, M et al. (2014). Dementia UK: Update Second Edition. Alzheimer’s Society. [online] Available at: http://eprints.lse.ac.uk/59437/1/Dementia_UK_Second_edition_-_Overview.pdf [Accessed 4 Jul. 2019]. p 16.
  4. Alzheimer’s Research UK. (2018). Prevalence by age in the UK. [online] Available at: https://www.dementiastatistics.org/statistics/prevalence-by-age-in-the-uk/ [Accessed 4 Jul. 2019].
  5. Alzheimer’s Research UK. (2018). Mild cognitive impairment. [online] Available at: https://www.alzheimersresearchuk.org/about-dementia/types-of-dementia/mild-cognitive-impairment/about/ [Accessed 4 Jul. 2019]. 
  6. Alzheimer’s Research UK. (2018). Different types of dementia. [online] Available at: https://www.dementiastatistics.org/statistics/different-types-of-dementia/ [Accessed 4 Jul. 2019].
  7. National Institute on Aging. (2017). What Happens to the Brain in Alzheimer’s Disease? [online] Available at: https://www.nia.nih.gov/health/what-happens-brain-alzheimers-disease [Accessed 4 Jul. 2019].
  8. British Heart Foundation. (2019). Vascular dementia. [online] Available at: https://www.bhf.org.uk/informationsupport/conditions/vascular-dementia [Accessed 4 Jul. 2019].
  9. National Health Service. (2016). Overview: Dementia with Lewy bodies. [online] Available at: https://www.nhs.uk/conditions/dementia-with-lewy-bodies/  [Accessed 4 Jul. 2019].
  10. Nelson, P. et al. (2019). Limbic-predominant age-related TDP-43 encephalopathy (LATE): consensus working group report. Brain. Vol.142:6. pp 1503-1527. [online] Available at: https://academic.oup.com/brain/article/142/6/1503/5481202 [Accessed 4 Jul. 2019].
  11. Alzheimer’s association. (2019). Frontotemporal Dementia. [online] Available at: https://www.alz.org/alzheimers-dementia/what-is-dementia/types-of-dementia/frontotemporal-dementia [Accessed 4 Jul. 2019].
  12. National Institute for Health and Care Excellence. (2018) Dementia: assessment, management and support for people living with dementia and their carers. Nice guideline 97. [online] Available at: https://www.nice.org.uk/guidance/ng97/chapter/Recommendations#diagnosis [Accessed 4 Jul. 2019]. Standard 1.2.13.
  13. Prince, M. et al. (2014). World Alzheimer Report 2014. Dementia and Risk Reduction. An analysis of Protective and Modifiable Risk Factors. Alzheimer's Disease International, London UK. [online] Available at: https://www.alz.co.uk/research/WorldAlzheimerReport2014.pdf (PDF) [Accessed 4 Jul. 2019]. pp. 66-83.  
  14. Prince, M. et al. (2014). World Alzheimer Report 2014. Dementia and Risk Reduction. An analysis of Protective and Modifiable Risk Factors. Alzheimer's Disease International, London UK. [online] Available at: https://www.alz.co.uk/research/WorldAlzheimerReport2014.pdf (PDF) [Accessed 4 Jul. 2019]. pp. 26-39.  
  15. Prince, M. et al. (2014). World Alzheimer Report 2014. Dementia and Risk Reduction. An analysis of Protective and Modifiable Risk Factors. Alzheimer's Disease International, London UK. [online] Available at: https://www.alz.co.uk/research/WorldAlzheimerReport2014.pdf (PDF) [Accessed 4 Jul. 2019]. pp. 42-63.  
  16. Prince, M. et al. (2014). World Alzheimer Report 2014. Dementia and Risk Reduction. An analysis of Protective and Modifiable Risk Factors. Alzheimer's Disease International, London UK. [online] Available at: https://www.alz.co.uk/research/WorldAlzheimerReport2014.pdf (PDF) [Accessed 4 Jul. 2019]. p. 61.  
  17. Alzheimer’s Research UK. (2018). Genes and dementia. [online] Available at: https://www.alzheimersresearchuk.org/about-dementia/helpful-information/genes-and-dementia/ [Accessed 4 Jul. 2019].
  18. Knight, R et al. (2018). A Systematic Review and Meta-Analysis of the Effectiveness of Acetylcholinesterase Inhibitors and Memantine in Treating the Cognitive Symptoms of Dementia. Dementia and Geriatric Cognitive Disorders, vol. 45, no. 3-4. pp. 131-151. [online] Available at: https://www.karger.com/Article/FullText/486546 [Accessed 4 Jul. 2019].
  19. National Institute for Health and Care Excellence. (2018) Dementia: assessment, management and support for people living with dementia and their carers. Nice guideline 97. [online] Available at: https://www.nice.org.uk/guidance/ng97/chapter/Recommendations#pharmacological-interventions-for-dementia [Accessed 4 Jul. 2019]. Standards 1.5.10-1.5.13.
  20. World Health Organisation. (2019). Risk reduction of cognitive decline and dementia: WHO guidelines. Geneva: World Health Organisation. [online] Available at:  https://apps.who.int/iris/bitstream/handle/10665/312180/9789241550543-eng.pdf?ua=1 (PDF) [Accessed 4 Jul. 2019]. p. 19.
  21. Spector, A. et al. (2003). Efficacy of an evidence-based cognitive stimulation therapy programme for people with dementia: Randomised Controlled Trial. British Journal of Psychiatry. Vol. 183 pp. 248-254. [online] Available at: http://www.cstdementia.com/media/document/spector-et-al-2003.pdf [Accessed 4 Jul. 2019].
  22. Woods, B. et al. (2018). Reminiscence therapy for dementia. Cochrane Database of Systematic Reviews 2018, Issue 3. [online] Available at: https://www.cochranelibrary.com/cdsr/doi/10.1002/14651858.CD001120.pub3/full [Accessed 4 Jul. 2019].
  23. Join dementia research. (2019). About the service. [online] Available at: https://www.joindementiaresearch.nihr.ac.uk/content/about [Accessed 4 Jul. 2019].
  24. Office of the Public Guardian. (2019). Make, register or end a lasting power of attorney. Government Digital Service. [online] Available at: https://www.gov.uk/power-of-attorney [Accessed 4 Jul. 2019].
  25. National Health Service. (2017). Advance decision (living will); End of life care. [online] Available at: https://www.nhs.uk/conditions/end-of-life-care/advance-decision-to-refuse-treatment/ [Accessed 4 Jul. 2019].
  26. Alzheimer’s Society. (2019). Driving and dementia. [online] Available at: https://www.alzheimers.org.uk/get-support/staying-independent/driving-and-dementia [Accessed 4 Jul. 2019].
  27. Department of Transport. (2019). Dementia and driving. Government Digital Service. [online] Available at: https://www.gov.uk/dementia-and-driving [Accessed 4 Jul. 2019].
  28. General Medical Council. (2019). Patients’ fitness to drive and reporting concerns to the DVLA or DVA. [online] Available at: https://www.gmc-uk.org/ethical-guidance/ethical-guidance-for-doctors/confidentiality---patients-fitness-to-drive-and-reporting-concerns-to-the-dvla-or-dva/patients-fitness-to-drive-and-reporting-concerns-to-the-dvla-or-dva [Accessed 4 Jul. 2019].
  29. Thakur, M. (2007). Pseudodementia. Encyclopedia of Health & Aging.  SAGE Publications, Inc.  pp. 477-8. [online] Available at: http://go.galegroup.com/ps/i.do?p=GVRL&u=cuny_laguardia&id=GALE|CX2661000198&v=2.1&it=r&sid=GVRL&asid=3ad1e77f [Accessed 4 Jul. 2019].
  30. National Institute for Health and Care Excellence. (2009) Depression in adults: recognition and management. Nice clinical guideline 90. [online] Available at: https://www.nice.org.uk/guidance/cg90/chapter/1-Guidance#stepped-care [Accessed 4 Jul. 2019]. Standard 1.2.
This translation was produced by CLEAR Global (Jan 2025)
Read more to receive further information regarding a career in psychiatry