శారీరక రోగం మరియు మానసిక ఆరోగ్యం

Physical illness and mental health 

Below is a Telugu translation of our information resource on physical illness and mental health. You can also view our other Telugu translations.

హక్కు నిరాకరణ

దీన్ని చదవడానికి ముందు, దయచేసి మా నిరాకరణను సమీక్షించండి.

మనలో చాలా మంది జీవితంలో ఏదో ఒక దశలో చాలా తీవ్రమైన లేదా జీవితాన్ని మలుపు తిప్పే శారీరక రోగంని కలిగి ఉండొచ్చు. అనారోగ్యం, మరియు దాని చికిత్స రెండూ మనం ఆలోచించే మరియు అనుభూతి చెందే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమాచారం అనేది ఎవరు అయితే శారీరక అనారోగ్యం యొక్క ప్రభావం తో కలిగే మానసిక రోగం గల వారికి మరియు ఎవరైతే వారిని సంరక్షణ చేస్తున్నారో వారి కొరకు.

శారీరక అనారోగ్యం వలన కలిగే ప్రభావము ఏమిటి?

శారీరక అనారోగ్యాన్ని కలిగి ఉండటం లేదా అభివృద్ధి చేయడం మీ జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీవితంలోని ఆచరణాత్మక భాగాలను ప్రభావితం చేయవచ్చు, అవి:

  • పని - మీరు పని చేయడం మానేయడం, తక్కువ పని చేయడం లేదా ఉద్యోగాలు మార్చడం వంటివి మీరు కనుగొనవచ్చు.
  • దైనందిన కార్యక్రమాలు - మీకు రోజువారీ ఆహ్లాదకరమైన పనుల్లో ఇబ్బంది లేదా స్నేహితులని, కుటుంబ సభ్యుల సమావేశంలో కలవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు మీ స్వంతంగా చేసే పనులను చేయడానికి మీకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా వృత్తిపరమైన సేవ నుండి మద్దతు అవసరం కావచ్చు.
  • ఆర్థిక స్థితి - శారీరక అనారోగ్యం వివిధ కారణాల వల్ల మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, వైద్య నియామకాల కోసం చేసే ప్రయాణ ఖర్చులు లేదా ఎందుకంటే మీరు లేదా మిమ్మల్ని సంరక్షణ చేసే వారు తక్కువ పని చేయాల్సి రావచ్చు.
  • ఆసుపత్రిలో సమయం గడపడం - మీకు ఆసుపత్రిలో కొన్ని చికిత్సలు లేదా ఆపరేషన్లు చేయాల్సి రావచ్చు. దీని అర్థం ఇంటి నుండి మరియు మీ సాధారణ మద్దతు సంఘంలకు దూరంగా సమయం గడపడం.

శారీరక అనారోగ్యం కలిగి ఉండటం వలన మీరు ఎలా ఆలోచిస్తారు మరియు అనుభూతి చెందుతారు అనే దానిపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది:

  • ఒత్తిడి - అర్థమయ్యేలా, శారీరక అనారోగ్యం వలన మీరు భవిష్యత్తు గురించి చింత, మరియు ప్రస్తుతం గురించి ఒత్తిడికి గురవుతారు. మీరు కొన్ని విషయాల్లో ప్రత్యేక ఆందోళన అనుభవిస్తారు. ఉదాహరణకు, ఒక ముఖ్యమైన పరీక్ష ఫలితం, లేదా మీరు ఆసుపత్రికి వెళ్లవలసి వస్తే పిల్లల సంరక్షణను నిర్వహించడం.
  • స్వీయ భావం – శారీరక అనారోగ్యాలు మీ శరీరం మరియు మీ జీవితం యొక్క నియంత్రణలో లేనట్లు అనిపించవచ్చు. శారీరక రోగం అనేది సాధారణంగా మీరు నియంత్రణ చేయలేని విషయం కాదు. ఇది చాలా విచారకరం మరియు నిరాశజనకమైనది.
  • బంధాలు - శారీరక రోగం కలిగి ఉండుట వలన మిమ్మల్ని ఒంటరిగా మరియు స్నేహితుల మరియు కుటుంబం నుంచి వేరుచేయు అనుభూతిని కలిగిస్తుంది. వారికి చింత లేదా బాధ వస్తాయని మీరు మీ అనుభూతిని వారితో పంచుకోవడానికి సిద్దంగా ఉండరు. లేదా మీరు ఏమి చేస్తున్నారో మీరు పంచుకోవాలనుకోవచ్చు కానీ వారికి అర్థం కాదు అని భావిస్తారు.
  • ప్రపంచాన్ని అర్దం చేసుకోవడం - అనారోగ్యం కలగడం వలన మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు ఏది న్యాయమైనది మరియు సరైనది అన్న విషయంపైన మనకున్న అవగాహనను ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నం కావచ్చును. కొంతమంది అది వారి ఆధ్యాత్మిక లేదా మత విశ్వాసాలను ప్రభావితం చేస్తుందని కనుగొంటారు.

ఒకవేళ మీ శారీరక అనారోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లయితే, సహాయం అందుబాటులో ఉంది. మీ శారీరక ఆరోగ్య సంరక్షణను అందించే వ్యక్తులు మీ మానసిక ఆరోగ్యంకు మద్దతు కావాలా అని తెలుసుకోవాలనుకుంటారు. వారు మీకు సహాయం చేయగల ఇతర నిపుణులు లేదా సంస్థలకు సూచించగలరు.

ఒకవేళ నా శారీరక రోగం నా మానసిక ఆరోగ్యంపై ప్రభావితంచేస్తుంటే, దానిని నేను ఎలా చెప్పగలను?

మీరు ఎవరు మరియు మీ జీవితంలో ఏమి జరుగుతుంది అనే దాన్ని బట్టి, శారీరక అనారోగ్యం మీ మానసిక ఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. మేము అన్ని మానసిక రోగాల సమస్యలను ఇందులో పొందుపరచలేదు, కానీ దిగువన కొన్నిలక్షణాలు మీరు చూడాలనుకోవచ్చు.

ఆందోళన

ఒక వేళ మీరు ఆందోళనను అనుభవిస్తునట్లయితే గనుక, మీరు దానిని కనుగొనవచ్చు:

  • మీరు సదా ఒక విషయం గురించి, లేదా చాలా భిన్నమైన విషయాల గురించి విచారం పొందుతారు
  • మీరు విశ్రాంతి తీసుకోలేకపోతున్నారని భావిస్తారు
  • మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో, మీ శ్వాస లేదా మీ జీర్ణక్రియలో మార్పులను మీరు గమనించవచ్చు.
  • మీరు ఆందోళన యొక్క లక్షణాల గురించి మరింత అర్ధం చేసుకోవచ్చు మా  ఆందోళన వనరు .  చదవటం ద్వారా

ఆవేదన

ఒక వేళ మీరు ఆందోళనను అనుభవిస్తునట్లయితే గనుక, మీరు దానిని కనుగొనవచ్చు:

  • ఎక్కువ లేదా అన్ని సమయాల్లో మీరు చాలా అసంపృత్తిని అనుభూతి చెందుతారు
  • మీరు అలసట, అవిశ్రాంతిని అనుభూతి చెందుతారు మరియు నిద్ర, ఆహారపు అలవాట్లు లేదా సంభోగం పట్ల ఆసక్తి లో మార్పులు గమనిస్తారు
  • మీరు అందరితో సంభాషణ చేయడానికి ఇష్టపడరు.

మీరు ఆవేదన లక్షణాలను లోతుగా చదివేటందుకు మా ఆవేదన వనరు .

సర్దుబాటు రుగ్మత

మీరు శారీరక అనారోగ్యం లేదా గాయాన్ని అనుభవించినప్పుడు ఆందోళన, బాధ లేదా కలత చెందడం పూర్తిగా అర్థమయ్యే విషయం. కష్టంలేదా అనిశ్చిత సమయము లో ‘సాధారణ’ రీతి లో స్పందిచుటకు తావు లేదు.

ఏది ఏమైన కూడ, ఒకవేళ మీరు ఒక ఒత్తిడి విషయం లేదా వరుస విషయాల్లో ‘సర్దుబాటు’ కోసం ఇబ్బంది పడితే, మీకు ‘సర్దుబాటు రుగ్మత’ వుండి ఉండవచ్చు.

ఒకవేళ మీకు సర్దుబాటు రుగ్మత ఉంటే, 
మీరు:

  • మీ శారీరక రోగం లేదా దాని ప్రభావం గురించి ఆలోచించడం మానుకోలేకపోతారు
  • శారీరక అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు చాలా ఆందోళనగా లేదా బాధగా అనిపిస్తుంది
  • మీ జీవితంలోని వివిధ రంగాల్లో ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఎదుర్కోవడానికి లేదా పని చేయడానికి కష్టం అనిపించడం.

మీకు గనుక సర్దుబాటు రుగ్మత ఉంటే, మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు లేదా గాయాన్ని అనుభవిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాత ఇది సాధారణంగా ఒక నెలలో స్పష్టంగా కనిపిస్తుంది.

తర్వాత ఆందోళన ఒత్తిడి రుగ్మత (PTSD)

శారీరక అనారోగ్యం లేదా గాయాన్ని అనుభవించే కొంతమంది వ్యక్తులకు తర్వాత ఆందోళన ఒత్తిడి రుగ్మత (PTSD) అనేది అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా ఒక సంఘటన లేదా సంఘటనల శ్రేణికి మానసిక ప్రతిచర్యను అభివృద్ధి చేసినప్పుడు PTSD జరుగుతుంది.

PTSD కి కారణమయ్యే అనుభవాలు:

  • తీవ్రమైన శారీరక రోగ నిర్దారణ జరుగుతున్నప్పుడు
  • తీవ్ర చికిత్స లో ఉన్నపుడు
  • సంక్లిష్టమైన ప్రసవ అనుభవాలు కలిగినప్పుడు
  • తీవ్ర ప్రమాదం లో చిక్కుకున్నప్పుడు.

మీకు PTSD ఉన్నట్లయితే మీరు ఈ క్రింది లక్షణాలలో కొన్నింటిని అనుభవించవచ్చు:

  • అనవసరమైన మరియు మనసును భాధించే జ్ఞాపకాలు లేదా ఆ సంఘటన గురించి కలలు
  • ఆ సంఘటన మళ్లీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది
  • సంఘటనను గుర్తుంచుకోవడంలో కష్టపడడం, లేదా దాని గురించి ఆలోచించకుండా ఉండడం
  • స్నేహితుల మరియు కుటుంబ నుంచి వేరు పడిన అనుభూతి
  • మీ గురించి, ఇతరుల గురించి లేదా ప్రపంచం గురించి ప్రతికూలంగా భావించడం
  • సంతోషంగా లేకపోవడం, మరియు సంతోషంగా లేదా సంతృప్తి చెందడానికి కష్టపడడం
  • చెల్లాచెదురు గా మరియు ఏకాగ్రత లోపం లేదా నిద్రలేమిని అనుభవించడం
  • ఇతర వ్యక్తుల పట్ల కోపంగా ప్రవర్తించడం
  • ప్రమాద లేదా నిర్లక్ష్యంగా పనులు చేయడం.

మీరు PTSD గురించి మరింత గా తెలుసుకోవడానికి  ఇక్కడ.

మీరు ఆరోగ్యంగా లేరని గుర్తించడం

మీరు ఏదైనా మానసిక అనారోగ్యాన్ని ఎదుర్కొంటుంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు గమనించవచ్చు:

  • మీరు సాధారణంగా చేసే దాని కంటే భిన్నంగా ప్రవర్తించవచ్చు
  • మీరు మీ శారీరక రోగం కి చికిత్స లేదా ఔషధం తీసుకోవడానికి ఇష్టపడరు
  • మీరు వైద్య నియామకాలను కోల్పోతారు.

పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, మీరు దీన్ని గమనించవచ్చు:

  • అలసిపోయిన
  • నిద్రలేమి
  • ఆకలి మందగించడం.

వీటిలో కొన్ని శారీరక అనారోగ్యం లేదా వైద్య చికిత్సల వల్ల కూడా సంభవించవచ్చు. ఇది మిమ్మల్ని లేదా మీ సంరక్షణ చూసే వారికి ఇది ఒకవేళ ‘సాధారణమో’ లేదా కాదో తెలుసు కోవడం కష్టంగా ఉండొచ్చు.

మీకు ఎలా అనిపిస్తుందో మీ వైద్యుడు లేదా మీరు విశ్వసించే వారితో పంచు కొనవచ్చును. వారు మీకు ఈ మార్పు శారీరక రోగం లేదా మానసిక రోగం వల్లన అనేది తెలిసేలా సహాయం చేస్తారు.

మీరు మానసిక రోగం గురించి మరింత గా చదవవచ్చు ఇక్కడ.

ఒకవేళ నాకు శారీరక అనారోగ్యం ఉంటే మానసిక అనారోగ్యం వచ్చే అవకాశం ఉందా?

శారీరక రోగం ఉన్న అందరికీ ఈ మానసిక రోగం కలగదు. ఏది ఏమైనా దీర్ఘకాలంగా శారీరక రోగం ఉన్నవారికి ఎక్కువగా మానసిక ఆరోగ్య పరిస్థితి తక్కువగా ఉండే అవకాశం ఉంది. పరిశోధనలు మానసిక అనారోగ్యాలు మరియు కొన్ని శారీరక వ్యాధుల మధ్య సంబంధాన్నికనుగొన్నారు అవి:

  • క్యాన్సర్
  • మధుమేహం
  • ఉబ్బసం
  • అధిక రక్తపోటు
  • మూర్చ రోగం.

ఏది ఏమైనా, ఈ శారీరక రుగ్మతలు మాత్రమే మీ యొక్క మానసిక రోగంని ప్రభావితం చేయవు.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులతో పోలిస్తే శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు 2 నుండి 3 రెట్లు నిరాశకు గురయ్యే అవకాశం ఎక్కువ.

శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎలా ముడిపడి ఉన్నాయి?

శారీరక మరియు మానసిక వ్యాధులు ఎలా అనుసంధానం అయ్యాయో ఎప్పుడూ స్పష్టంగా ఉండదు.

మీరు ఎవరో మరియు మీకు ఏ రకమైన శారీరక లేదా మానసిక వ్యాధి ఉందో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది:

  • శారీరక రోగం కలిగి ఉండుట అది మానసిక రోగంని అభివృద్ధి చేయవచ్చు
  • మీ శారీరక వ్యాధి మీ మానసిక వ్యాధికి సంబంధం కలిగి ఉండవచ్చు
  • మీ శారీరక రోగం మరియు మానసిక ఆరోగ్య పరిస్థితి సంబంధం లేకపోయినా కానీ ఒకేసారి జరగవచ్చు.

బలహీనమైన మానసిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని విషయాలు నేరుగా దోహదపడతాయి, వీటిలో:

  • ఒత్తిడి - శారీరక అనారోగ్యం కలిగి ఉండటం చాలా ఒత్తిడిని కలిగిస్తుంది, మరియు ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • మందుల చికిత్సలు - కొన్ని మందుల చికిత్స అనేది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, స్టెరాయిడ్లు భావోద్వేగ మార్పులు మరియు మానసిక రుగ్మతల లక్షణాలను కారణమవుతాయని పరిశోధనల్లో తేలింది. వ్యాధి లక్షణాలలో ఇవి ఉంటాయి:
    • నిజం కాని విషయాలను నమ్మడము
    • స్పష్టంగా ఆలోచించడానికి ఇబ్బంది
    • లేని వాటిని అనుభవించడం.
  • శారీరక రోగాలు - కొన్ని శారీరక రోగాలు మెదడు పని తీరును ప్రభావం చేస్తాయి. ఉదాహరణకు, తక్కువగా పనిచేసే థైరాయిడ్ (హైపోథైరాయిడిజం) ఉన్న వ్యక్తులు ఆవేదన మరియు ఆందోళనను అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 నేను ఎప్పుడు మానసిక ఆరోగ్య పరిస్థితిని వృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది?

 ఒకవేళ మీరు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది:

  • మీరు ఇది వరకు మానసిక ఆరోగ్యంతో ఇబ్బంది పడ్డప్పుడు,లేదా మానసిక ఆరోగ్య పరిస్థితిని ఇది వరకు గుర్తించినప్పుడు
  • మీకు మీ రుగ్మత గురించి మాట్లాడటానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు లేకపోవడం
  • మీకు వేరే సమస్యలు లేదా ఒత్తిడి కారణాలు మీ జీవితంలో ఒకే సమయంలో జరుగుతూ ఉంటే. ఉదాహరణకు, మీ ఉద్యోగం పోవడం, విడాకులు, లేదా ప్రియమైన వారి చావు.  కొన్నిసార్లు జీవితంలో సానుకూల మార్పులు కూడా ఊహించనివి లేదా ఒత్తిడితో కూడినవి అయితే మీ మానసిక ఆరోగ్యాన్నిఅంచనాలకు విరుద్ధంగా లేదా మానసిక ఒత్తిడి కలిగించేవిగా చేస్తాయి.
  • మీ శారీరక రోగం మీకు అధిక నొప్పి కలిగిస్తుంటె
  • మీకు ఆఖరి దశ లేదా ప్రాణాంతకమైన వ్యాధి ఉంది
  •  మీ అనారోగ్యం మిమ్మల్ని మీరు చూసుకోకుండా ఆపుతుంది.

మీరు ఏ సమయంలో దుర్భర మానసిక రోగం అనుభవిస్తారు అంటె:

  • మీ అనారోగ్యం గురించి మీకు మొదట చెప్పినప్పుడు
  • ఏదైనా పెద్ద శస్త్ర చికిత్స జరగడం లేదా ఏదైనా ప్రతికూల ప్రభావం చికిత్స వలన గురి అయితే
  • ఒకవేళ మళ్లీ జబ్బు అనేది తిరిగి రావడం , ఎప్పుడు అయితే మీరు కోలుకొన్న తర్వాత. ఉదాహరణకు క్యాన్సర్ పురోభివృద్ధి లేదా రెండవసారి గుండెపోటు రావడం
  • ఒకవేళ మీ అనారోగ్యం చికిత్సకు ప్రతిస్పందించడం ఆపివేస్తే.

ఎప్పుడు నేను సహాయం కోసం అడగాలి?

మీకు శారీరక రోగం కలిగినప్పుడు కొంత ఆందోళన మరియు భావోద్వేగ మార్పు అనేది అర్దవంతమైనది. ఏది ఏమైనా, మీరు ఇలా చేస్తే మీరు సహాయం పొందవచ్చు:

  • మీరు మానసిక ఆరోగ్యంతో ఇది వరకు ఇబ్బంది పడి ఉంటే, లేదా మానసిక రుగ్మతతో నిర్ధారణ అయితే, మరియు మీరు మరలా అనారోగ్యంగా అయ్యారని ఆలోచనలో ఉంటే
  • మీరు ఇంతకు ముందు కంటే అధ్వాన్నంగా భావిస్తే
  • కాలం తో పాటు మెరుగుపడుతున్నట్లు కనిపించకపోతే
  • మీ సంబంధాలు, పని, ఆసక్తులు లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే మీ భావాలను గమనిస్తారు
  • జీవితం విలువైనది కాదని, లేదా మీరు లేకపోతే ఇతర వ్యక్తులు బాగుంటారని భావిస్తారు.

నేను సహాయం పొందాలా వద్దా అని నిర్ణయం చేయ లేకపోవడం

శారీరక రోగంతో ఉంటే సహాయం అడగడం కష్టంగా ఉంటుంది.  కింది ఆలోచనలు నిజం కానప్పటికీ, ఇది సాధారణ ప్రతిస్పందన:

  • “నేను నా శారీరక ఆరోగ్యంపై ఏకాగ్రత కలిగి ఉండాలి. నా మానసిక ఆరోగ్యం తక్కువ ప్రాధాన్యత కలిగింది.” - మీ మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం సంబంధం కలిగినవి. మానసికంగా స్థిరంగా ఉండుట వలన అది శారీరక ఆరోగ్యంపై అనుకూల ప్రభావం చూపుతుంది.
  • “నేను ఇతర విషయాల మీద దృష్టి పెట్టాల్సి రావడం.” - మీరు మీ కుటుంబం, ఆర్థిక పరిస్థితి, నివాసం లేదా పనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కాని ఒకవేళ మీరు మీ మానసిక ఆరోగ్యం కోసం సమయం ఇవ్వకుండా ఉంటే ,మీరు మరింత అనారోగ్యంకి గురౌతారు. ఇలా జరిగితే మీరు ఈ ముఖ్యమైన పనులలో దేనినీ కూడా చేయలేరు.
  • “వాస్తవానికి నేను నిరుత్సాహంగా ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను. అక్కడ సహాయం పొందేందుకు ఏమి లేదు.” - ఇది మీరు మానసిక రోగంతో ఉన్నారని పూర్తిగా అర్ధమయ్యే రీతిలో ఉంది. కానీ, దాని అర్దం మీరు సహాయానికి అనర్హులు అని కాదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, మద్దతు మరియు శ్రద్ధ వహించడానికి అర్హులు.
  • “నేను కృతజ్ఞత లేనివాడిగా కనిపించడం ఇష్టం లేదు, నా ఆరోగ్య సంరక్షణ బృందం నాకు సహాయం చేయడానికి చాలా చేస్తోంది.” - మీ వైద్యులు మీ మానసిక ఆరోగ్యంతో పాటు మీ శారీరక ఆరోగ్యం గురించి కూడా వినాలనుకుంటారు. ఇదంతా మిమ్మల్ని క్షేమంగా ఉంచడంలో భాగమే, మద్దతు కోరినందుకు మీరు కృతజ్ఞత లేనివారని వారు భావించరు.

నేను ఎలా సహాయం పొందాలి?

మీరు ఎలా భావిస్తున్నారో మీరు విశ్వసించే వారితో మాట్లాడటం ద్వారా ప్రారంభించవచ్చు. తరచుగా మీ భావాలను పంచుకోవడం వలన మీ మానసిక ఆరోగ్యంపై అనుకూల ప్రభావం దానంతట అదే చూపుతుంది.

ఒకవేళ మీకు ఇంకా మద్దతు కావాలి అంటే, సాధారణ వైద్యుడుతో, లేదా మీ శారీరక రోగ సహాయక వైద్య బృందంతో మాట్లాడండి. మీకు ఎలాంటి మద్దతు అందుబాటులో ఉందో వారు మీకు సలహా ఇవ్వగలరు మరియు దాన్ని పొందడానికి మీకు సహాయపడగలరు.

శారీరక రోగం తో జీవనం చేసే వారికి చాలా స్వచ్ఛంద సంస్థలు మరియు సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. మీరు ఈ వనరు చివరిలో వీటి గురించి మరింత తెలుసుకోవచ్చు.

మీరు ఇప్పటికే మానసిక ఆరోగ్య బృందం సంరక్షణలో ఉన్నట్లయితే, మీరు శారీరక అనారోగ్యాన్ని అభివృద్ధి చేస్తే కూడా వారికి చెప్పాలి. వారు మీకు మద్దతునిచ్చేలా దీన్ని తెలుసుకోవడం వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ విధమైన చికిత్స నాకు లభిస్తుంది?

ఏ విధమైన చికిత్స మీ రు పొందుతారో అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది:

  • మీరు అనుభవించే సవాళ్లు
  • మీ జీవితంలో వాటి ప్రభావం
  • మీ వ్యక్తిగత పరిస్థితులు.

మీరు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, మీకు ఈ క్రిందివి అందించబడవచ్చు:

భాధను అనుభవిస్తున్న వ్యక్తులకు, మానసిక ప్రవర్తనా చికిత్స (CBT)కూడా సహాయకరంగా ఉన్నట్లు చూపబడింది.

మీరు మా సమాచార వనరులను చదవడం ద్వారా క్రింది పరిస్థితులకు చికిత్సల గురించి మరింత తెలుసుకోవచ్చు:

మీరు వివిధ రకాల మానసిక రుగ్మత ల మరియు వాటి చికిత్స గురించి మరింతగా ఇక్కడ చదువవచ్చు.

ఎలా ఈ చికిత్సలు సహాయ పడతాయి?

మాట్లాడే చికిత్సలు

సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులకు కూడా, మీరు ఎలా భావిస్తున్నారో వ్యక్తపరచడం కష్టం. మీరు చింతించకూడదనుకుంటే, మీకు బాగా తెలిసిన వారితో మీరు ఎలా భావిస్తున్నారో పంచుకోవడం కొన్నిసార్లు కష్టం.

ఈ కారణంగా, నిపుణులతో మాట్లాడటం సులభం గా ఉంటుంది. భావాలు, ఆలోచనలు మరియు ఆచరణాత్మక సమస్యలతో మెరుగ్గా ఎదుర్కొనే మార్గాలను కనుగొనడంలో అవి మీకు సహాయపడతాయి.

మీరు మాట్లాడే చికిత్సను ప్రారంభించిన తర్వాత, మీ చింతల గురించి మాట్లాడకుండానే మీరు వెంటనే మంచి అనుభూతి చెందుతారని మీరు కనుగొనవచ్చు. లేదా మీకు మంచి అనుభూతిని కలిగించడానికి మాట్లాడే చికిత్సలకు ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఔషధం

ఇది మీకు ఇచ్చిన మందుల రకం మరియు మీరు పొందుతున్న ఇతర మద్దతుపై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా, మందులు మీ జీవితంలో ఇతర సానుకూల మార్పులను చేయడం ప్రారంభించడానికి తగినంతగా అనుభూతి చెందడానికి మీకు సహాయపడతాయి. ఎలాంటి మందులు అయినా సాధారణంగా పనిచేయడానికి కొంత సమయం తీసుకుంటాయి, మరియు మీ వైద్యుడు సూచించినట్లుగా తీసుకోవాలి.

మీరు మీ నిద్ర, ఆకలి లేదా శారీరక నొప్పితో పోరాడుతున్నట్లయితే మందులు కూడా సహాయపడవచ్చు. మందులు మీకు ఎలా సహాయపడగలవో మీ వైద్యుడుతో మాట్లాడండి.

నేను శారీరక వ్యాధి కోసం ఇప్పటికే మందులు తీసుకుంటుంటే, మానసిక రోగానికి మందులు తీసుకోవచ్చా?

మీకు శారీరక అనారోగ్యం ఉంటే, మీరు ఇప్పటికే మందులు తీసుకుంటూ ఉండవచ్చు. మీరు తీసుకుంటున్న మందులు ఒకటితో ఒకటి కలిసి తీసుకోవద్దని మీ వైద్యుడు మీతో చెప్తారు. మీరు జాగ్రత్త పడాల్సిన దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే కూడా వారు మీకు తెలియజేస్తారు.

అన్ని మందులు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అయితే ఇవి సాధారణంగా తేలికపాటివి మరియు మీరు కొంతకాలంగా మందులు తీసుకుంటున్నప్పుడు తగ్గిపోతాయి. మీరు అనుభవించే శారీరక లేదా భావోద్వేగ మార్పులను మీ వైద్యునితో పంచుకోవాలి.

నాకు నేను ఎలా సహాయపడగలను?

నిపుణుల సహాయం కోరడంతో పాటు, మీకు సహాయం చేయడానికి మీరు చేయగల అనేక విషయాలు ఉన్నాయి:

ఇతరులతో మాట్లాడటం

మీ భయాలు మరియు ఆందోళనలను మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో పంచుకోండి. గతంలో మద్దతుగా ఉన్న మరియు మంచిగా వినే వ్యక్తితో మాట్లాడండి.

మీ వైద్యుడుతో మాట్లాడండి
మీ రోగం గురించి మీ వైద్యుడు లేదా సాధారణ వైద్యుడు నుండి ప్రశ్నలు అడగడానికి భయపడకండి. అనారోగ్యం లేదా దాని చికిత్స గురించి మీకు అనిశ్చితంగా ఉన్న అంశాలు ఉంటే, వారు వాటిని మీకు వివరించడంలో సహాయపడగలరు.

సహాయం పొందు
విభిన్న స్వచ్ఛంద సంస్థలు మరియు సంస్థలు మీకు నమ్మకమైన సమాచారం మరియు మద్దతు అందించగలవు. మీరు అదే శారీరక అనారోగ్యంతో జీవిస్తున్న ఇతరులతో కూడా మాట్లాడవచ్చు మరియు సహచర మద్దతును పొందవచ్చు.

ఆర్ధిక మద్దతు కోసం ధరఖాస్తు
మీకు శారీరక లేదా మానసిక వ్యాధి ఉంటే, మీరు ప్రయోజనాలు మరియు ఇతర ఆర్థిక సహాయానికి .అర్హులు కావచ్చు

బాగా తినడం
సమతుల్య ఆహారం తీసుకోండి. బరువు తగ్గడం లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి హానికరం. మీకు ఆహార సంబంధిత వ్యాధి ఉంటే, సమతుల్య మరియు ఆరోగ్యకరమైన ఆహారం మీకు భిన్నంగా ఉండవచ్చు.

 క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
వీలైతే, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక సాధారణ నడక లేదా పది నిమిషాల సులభ యోగా చేయడం వంటిది కావచ్చు.

సమతుల్యం పాటించడం
నెట్టడం మరియు విశ్రాంతి తీసుకోవడం మధ్య సమతుల్యతను కనుగొనడానికి ప్రయత్నించండి.

మీకు నచ్చే పనులు మీకోసం చేయండి (స్వీయ సంరక్షణ)
మీ రోజులో విశ్రాంతి, ఆహ్లాదకరమైన కార్యకలాపాలను రూపొందించండి. అది స్నేహితుడితో ఫోన్ కాల్ చేయడం నుండి తోటలో పుస్తకం చదవడం వరకు ఏదైనా కావచ్చు.

అతిగా మద్యం తాగడం మానుకోండి
దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఎక్కువ ఆల్కహాల్ తాగకుండా ప్రయత్నించండి.

మత్తు పదార్థాలు తీసుకోవడం మానుకోండి
మత్తు పదార్ధాలు మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు, మరియు మీరు ఇతర మందులను తీసుకుంటే ముఖ్యంగా ప్రమాదకరంగా ఉండవచ్చు. మీరు మా వెబ్‌సైట్‌లో వివిధ డ్రగ్స్గు రించి సమాచారం మరియు మద్దతును కనుగొనవచ్చు.

సొంత వైద్యం
కొంతమంది వ్యక్తులు తమ శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటానికి మద్యం లేదా మాదకద్రవ్యాలను ఉపయోగిస్తారు. దీనిని కొన్నిసార్లు ‘స్వీయ-ఔషధం’ అని పిలుస్తారు. మీకు స్వల్పకాలంలో ఇది సహాయకరంగా ఉండవచ్చు, కానీ సమయం గడిచేకొద్దీ అది మిమ్మల్ని మరింత దిగజార్చుతుంది. మీరు కష్టమైన భావాలను అధిగమించడానికి మత్తు పదార్ధాలు లేదా మద్యం ఉపయోగిస్తుంటే, మీ వైద్యునితో మాట్లాడండి.

తగినంత నిద్ర పొందడం
మంచి నిద్రా విధానాన్ని పాటించడానికి ప్రయత్నించండి. చిట్కాల కోసం బాగా నిద్రపోవడానికి మా సమాచారాన్ని చదవండి.

మీ మందులు తీసుకోండి
మీ వైద్యునితో చర్చించకుండానే మీ మందులను తీసుకోవడం ఆపివేయవద్దు, ఎంత మోతాదులో లేదా ఎప్పుడు తీసుకుంటున్నారో మార్చవద్దు లేదా ఇతర నివారణలను ప్రయత్నించకండి. మీ మందులకు అసౌకర్యకరమైన దుష్ప్రభావాలు ఉంటే, మీ వైద్యునికి చెప్పండి.

మీ ఆరోగ్య పరీక్షలకు వెళ్లండి
మీకు కొన్ని శారీరక లేదా మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉంటే, లేదా కొన్ని మందులు తీసుకుంటుంటే, మీ సాధారణ వైద్యుడు లేదా నిపుణితో నియమిత ఆరోగ్య పరీక్షలకు హాజరు కావాల్సిందిగా మీరు ఆహ్వానించబడతారు. ఈ పరీక్షలకు హాజరయ్యేలా చూసుకోండి, మరియు మీరు ఏదైనా కొత్త శారీరక లేదా మానసిక ఆరోగ్య లక్షణాలు అభివృద్ధి చేస్తే, మీ సాధారణ వైద్యుడు లేదా నిపుణుడికి తెలియజేయండి. ఇది మీకు చికిత్స చేస్తున్న వ్యక్తులకు సమస్యలు మరింత దిగజారడానికి ముందే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది.

నేను మరొకరికి ఎలా సహాయం చేయగలను?

ఎవరికైనా మానసిక ఆరోగ్యం సరిగా లేనప్పుడు మొదట వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తరచుగా గమనిస్తారు. మీకు తెలిసినవారిలో ఇది మీరు గమనించినట్లయితే:

  • సహాయం కోరేందుకు వారిని సున్నితంగా ప్రోత్సహించండి
  • సహాయం పొందితే, వారు సాధారణంగా మెరుగుపడతారని వారికి వివరించండి
  • సహాయం పొందడం బలహీనత యొక్క సంకేతం కాదని వారికి వివరించండి.

వారికి మరింత మద్దతు ఇవ్వడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

  • వారితో సమయం గడపండి – మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారితో సమయం గడపడం ఉపయోగకరంగా ఉంటుంది. వారు ఎలా భావిస్తున్నారో మాట్లాడమని మరియు వారు సాధారణంగా చేసే కొన్ని పనులను కొనసాగించమని వారిని సున్నితంగా ప్రోత్సహించండి.
  • వారికి భరోసా ఇవ్వండి – సమయం మరియు మద్దతుతో వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని భరోసా ఇవ్వండి. అది జరుగుతుందని నమ్మడం వారికి కష్టంగా అనిపించవచ్చు.
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించండి – వారిపై ఎక్కువ ఒత్తిడి లేకుండా, బాగా తినడానికి, బాగా నిద్రించడానికి, ఎక్కువ మద్యం వినియోగం చేయకుండా ఉండటానికి మరియు మందులు తీసుకోవడానికి ప్రోత్సహించండి.  భోజనం వండడం ద్వారా లేదా వారితో మద్యం సేవించని కార్యకలాపాన్ని చేయడం ద్వారా మీరు దీన్ని చేయడంలో వారికి సహాయపడవచ్చు.
  • మంచి శ్రోతగా ఉండండి – వారి పరిస్థితి లేదా చికిత్స గురించి వారికి ఏవైనా ఆందోళనలు లేదా ప్రశ్నల గురించి మాట్లాడటానికి మీరు అక్కడ ఉన్నారని వారికి తెలియజేయడానికి ఇది సహాయపడవచ్చు.
  • హెచ్చరిక సంకేతాల కోసం చూడండి దీనిని తీవ్రంగా పరిగణించండి మరియు వారు ఉంటే వారి వైద్యునితో మాట్లాడమని వారిని ప్రోత్సహించండి:
    • మరింత దుర్భరంగా మారుతున్నట్లు కనిపిస్తే
    • బతకడం ఇష్టం లేదని అన్నట్లు మాట్లాడటం మొదలు పెట్టినట్లయితే
    • వారు తమను తాము హానిచేసుకుంటున్నట్లయితే లేదా అలా చేయవచ్చని సూచన ఇచ్చినట్లయితే.

నేను ఒకరి పట్ల శ్రద్ధ వహిస్తాను, నాకు ఏ మద్దతు అందుబాటులో ఉంది?

శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకోవడం చాలా సవాలుగా ఉంటుంది. మీరు ఇతరులను చూసుకోవడంలో నిమగ్నమైతే, మిమ్మల్ని మీరు చూసుకోవడం మరియు మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై దృష్టి పెట్టడం మర్చిపోవడం కూడా సులభం.

మీరు ఎవరికైనా శ్రద్ధ వహిస్తే, మీకు మరియు మీరు శ్రద్ధ వహించే వ్యక్తికి ఏ సహాయం అందుబాటులో ఉందో చూడటానికి మీరు సంరక్షకుల అంచనాను కలిగి ఉండవచ్చు. సంరక్షకునిగా మీ పాత్రను సులభతరం చేయడానికి ఇది సహాయపడుతుంది. NHS వెబ్సైట్‌లో అంచనా పొందడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు సంరక్షకులకు అందుబాటులో ఉన్న సహాయం మరియు మద్దతు గురించి Carers Trust వెబ్సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

మేము మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని సంరక్షించడం గురించి ఒక వనరును అందిస్తున్నాము, ఇది క్రింది సమాచారాన్ని కలిగి ఉంటుంది:

  • సంరక్షకుడు అవ్వడం అంటే ఏమిటి
  • రోగుల మరియు సంరక్షకుల హక్కులు
  • ఒకరి కోసం ఎలా వాదించాలి
  • మిమ్మల్ని మీరు చూసుకోవడం
  • సంరక్షణ చేసే వారికి ఉండే లాభాలు
  • ఆరోగ్యం మరియు సామాజిక సంరక్షణ నిపుణులు సంరక్షకులకు మరియు రోగులకు ఎలా సమర్థవంతంగా మద్దతు ఇవ్వగలరు.

గుర్తించబడని అనారోగ్యం లేదా నొప్పితో జీవించడం

కొందరు వ్యక్తులు రోగనిర్ధారణ పొందకుండా అనారోగ్యం లేదా నొప్పితో జీవిస్తారు. దీనిని ‘వైద్యపరంగా వివరించలేని లక్షణాలు’అని కూడా పిలుస్తారు, మరియు ఎవరైనా కలిగి ఉన్న లక్షణాలకు వైద్యులు భౌతిక కారణాన్ని కనుగొనలేనప్పుడు.

అనారోగ్యం లేదా నొప్పితో జీవించే సాధారణ సవాళ్లు, మీ సమస్యలకు కారణమేమిటో తెలియకపోవడం ఇతర కారణాల వల్ల కష్టంగా ఉంటుంది:

  • మీ సమస్యలకు కారణమేమిటో తెలియకపోవడం భయానకంగా మరియు ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది మిమ్మల్ని మరింత దిగజార్చవచ్చు.
  • మీకు చికిత్సలు పొందడం కష్టంగా అనిపించవచ్చు.
  • రోగనిర్ధారణను కలిగి ఉండటం వలన మీరు అనుభవిస్తున్న వాటికి పేరు పెట్టడానికి మరియు ఇతరులకు వివరించడానికి మీకు సహాయపడుతుంది. ఇది లేకుండా, కొందరు వ్యక్తులు విశ్వసించబడటానికి లేదా ధృవీకరించబడటానికి కష్టపడతారు.
  • మీరు పని చేయని చికిత్సలను ప్రయత్నించి ఉండవచ్చు. ఇది నొప్పి కలిగించేలా ఉండవచ్చు, లేదా ఇతర శారీరక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.

ఈ విషయాలన్నీ మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి, ప్రత్యేకంగా మీ సమస్యలు దీర్ఘకాలం నిర్ధారించబడకపోతే.

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా వైద్యపరంగా వివరించలేని లక్షణాలను ఎదుర్కొంటుంటే, ఇంకా సహాయం అందుబాటులో ఉంది. ఇందులో ఇవి ఉండవచ్చు:

వైద్యపరంగా వివరణలేని లక్షణాల చికిత్స మరియు మద్దతు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కళాశాల వెబ్సైట్ని చూడండి.

తదుపరి సహాయం

సహాయం అందించగల సంస్థలు

శారీరక రోగాలతో బాధపడుతున్న వారికి మద్దతు అందించే అనేక స్వచ్ఛంద సంస్థలు మరియు సంస్థలు ఉన్నాయి. మేము వాటన్నింటినీ ఇక్కడ జాబితా చేయలేనప్పటికీ, UKలో అత్యంత సాధారణ అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతునిచ్చే స్వచ్ఛంద సంస్థల గురించిన సమాచారాన్ని మేము చేర్చాము.

మరిన్ని స్వచ్ఛంద సంస్థలను కనుగొనడానికి ఛారిటీ కమిషన్ రిజిస్టర్‌ ని ఉపయోగించండి.

ఆస్తమా + లంగ్ UK

 సహాయ వాణి: 0300 222 5800
వాట్సాప్

ఆస్తమా + లంగ్ UK ఊపిరితిత్తుల రోగాలతో జీవిస్తున్న వ్యక్తుల కోసం సహాయ వాణి, ఆరోగ్య సలహా మరియు మద్దతు సమూహాలను అందిస్తోంది.

పేగు క్యాన్సర్ UK

పేగు క్యాన్సర్ UK పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులకు సమాచారాన్ని మరియు మద్దతును అందిస్తుంది. ఇందులో రోగనిర్ధారణ, ఆరోగ్య సలహాలు, మద్దతు కార్యక్రమాలు, ఆన్‌లైన్ సమాజాలు, మరియు బుక్‌లెట్లు మరియుఫ్యాక్ట్‌షీట్‌ల ద్వారా మద్దతు ఉంటుంది.

ఇప్పుడు రొమ్ము క్యాన్సర్

 సహాయ వాణి: 0808 800 6000

ఈమెయిల్:  hello@breastcancernow.org లేదా వారి నర్సు ఫారమ్‌ను అడగడంను ఉపయోగించండి.

రొమ్ము క్యాన్సర్ నౌ రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు మద్దతు మరియు సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో ప్రత్యేక నర్సు సహాయవాణి, ప్రత్యక్ష సెషన్లు మరియు క్యాన్సర్‌పై సమాచారం, మద్దతు యాప్ మరియు ఆన్‌లైన్ఫో రమ్ ఉన్నాయి.

మధుమేహం UK

 సహాయ వాణి: 0345 123 2399

ఈమెయిల్: helpline@diabetes.org.uk

డయాబెటిస్ UK మధుమేహంతో జీవించే అన్ని అంశాలపై నిపుణుల సమాచారం మరియు సలహాలను అందిస్తుంది.

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్

 సహాయ వాణి: 0300 330 3311

ఈమెయిల్: hearthelpline@bhf.org.uk

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ హృదయ మరియు రక్త ప్రసరణ సంబంధిత రోగాలు, పరీక్షలు మరియు చికిత్సలపై సమాచారం అందిస్తుంది.

కిడ్నీ కేర్ UK

 సహాయ వాణి: 01420 541 424

ఈమెయిల్:info@kidneycareuk.org

కిడ్నీ కేర్ UK అనేది రోగి గ్రాంట్లు, సెలవుల గ్రాంట్లు, కౌన్సెలింగ్ మరియు వకీల్ సేవలు మరియు మరిన్నింటిని అందించే కిడ్నీ రోగి మద్దతు దాతృత్వ సంస్థ.

బ్రిటిష్ లివర్ ట్రస్ట్

 సహాయ వాణి: 0800 652 7330

ఈమెయిల్:  helpline@britishlivertrust.org.uk 

బ్రిటీష్ లివర్ ట్రస్ట్ ఒక నర్సు నేతృత్వంలోని సహాయ వాణి, మద్దతు గుంపులు మరియు కాలేయ వ్యాధి లేదా క్యాన్సర్‌తో జీవించడానికి ఆచరణాత్మక మద్దతును అందిస్తుంది.

‌నొప్పి పై చింత

 సహాయ వాణి: 0300 123 0789

ఈమెయిల్: help@painconcern.org.uk

పెయిన్ కన్సర్న్వే దనతో జీవించే వ్యక్తులకు మద్దతు ఇస్తుంది మరియు సహాయ వాణి, ఫోరమ్మ రియు స్వీయ-నిర్వహణ సాధనాలను అందిస్తుంది.

పార్కిన్సన్స్ UK

 సహాయ వాణి: 0808 800 0303.
పార్కిన్సన్స్ UK పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి మరియు వారిని చూసుకునే వారికి మద్దతును అందిస్తుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ UK

 సహాయ వాణి: 0800 074 8383

 ప్రోస్టేట్ క్యాన్సర్ UK ప్రోస్టేట్ క్యాన్సర్‌తో నివసించే వ్యక్తుల కోసం ప్రత్యేక నర్సు సహాయ వాణి, ప్రచురణలు, ఆన్‌లైన్ మద్దతు మరియు ఒకరి నుండి ఒకరు మద్దతుతో సహా మద్దతు మరియు సమాచారాన్ని అందిస్తుంది.

స్ట్రోక్ అసోసియేషన్

 సహాయ వాణి: 0303 3033 100

ఈమెయిల్: helpline@stroke.org.uk  

స్ట్రోక్ అసోసియేషన్ స్ట్రోక్ బారిన పడిన వ్యక్తులకు సహాయ వాణి, మద్దతు గుంపులు మరియు ఆన్‌లైన్ కమ్యూనిటీని అందిస్తోంది.

అరుపు
వచనం: 85258
అరుపు అనేది యూకేలో ఆత్రుతతో, అణగారిన, ఆత్మహత్యకు లేదా ఒత్తిడికి గురయ్యే వ్యక్తుల కోసం ఉచిత, గోప్యమైన వచన మద్దతు సేవ.

ఇంకా చదవడానికి

  • ది హ్యాపినెస్ ట్రాప్, డా. రస్ హ్యారిస్
  • శరీర గణనలను నిలుపుతుంది; మెదడు, మనస్సు మరియు శరీరం గాయం యొక్క వైద్యం, బెస్సెల్ వాన్ డెర్ కోల్క్
  • బహుశా మీరు ఎవరితోనైనా మాట్లాడాలి: పని పుస్తకం: మీ కథనాన్ని సవరించడానికి మరియు మీ జీవితాన్ని మార్చడానికి టూల్‌కిట్, లోరీ గాట్లిబ్

ఇతర వనరులు

క్రెడిట్‌లు

ఈ సమాచారాన్ని రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ ఎడిటోరియల్ బోర్డ్ (PEEB) రూపొందించింది. ఇది వ్రాసే సమయంలో అందుబాటులో ఉన్న ఉత్తమ సాక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.

నిపుణుడైన రచయిత: డాక్టర్ సంజుక్తా దాస్

పూర్తి సూచనలు అభ్యర్థనపై అందించబడతాయి. 

Read more to receive further information regarding a career in psychiatry